తమన్‌ పాటకు కేటీఆర్‌ ప్రశంస.!

మరిన్ని వార్తలు

సంగీత దర్శకునిగా తమన్‌ పేరు ఇప్పుడు మార్మోగిపోతోంది. ముఖ్యంగా అల్లు అర్జున్‌ నటించిన 'అల వైకుంఠపురములో..' సినిమాకి తమన్‌ అందించిన సంగీతం అందరి ప్రశంసలు అందుకుంటోంది. యూ ట్యూబ్‌లో రికార్డులు కొల్లగొడుతోంది. 'అల..' సినిమా రిలీజ్‌కి నాలుగు నెలలు ముందే విడుదల చేసిన 'సామజవరగమనా..' పాటకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి విశేషమైన ఆదరణ దక్కింది. దక్కుతూనే ఉంది. ఆ పాట మేనియా నుండి ఎవ్వరూ పక్కకి రాలేకపోతున్నారు. తెలంగాణా మంత్రి కేటీఆర్‌కి కూడా ఆ పాట మైండ్‌లోంచి పక్కకి వెళ్లలేకపోతోందట.

 

తాజాగా ఈ విషయాన్ని ప్రస్థావిస్తూ, కేటీఆర్‌ ఓ ట్వీట్‌ చేశారు. తమన్‌ సంగీత ప్రతిభని మెచ్చుకుంటూ ఆయనపై ప్రశంసల జల్లు కురిపించారు. ఈ పాటకు అద్భుతమైన సంగీతం అందించావ్‌.. అంటూ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఆయన ట్వీట్‌కి తమన్‌ సంతోషం వ్యక్తం చేశారు. ఇకపోతే, ఎప్పటికప్పుడే పలు సినిమాలపై కేటీఆర్‌ ఇదే విధంగా తన అభిప్రాయాలు వెల్లడిస్తుంటారు. రాజకీయాల్లో బిజీగా ఉన్నా, అప్పుడప్పుడూ సినిమాలు చూసేందుకు కూడా సమయం కేటాయిస్తుంటారు. సినిమాలు చూడడమే కాదు, ఆయా సినిమాలపై కేటీఆర్‌ తన అభిప్రాయాల్ని వెల్లడిస్తూ ట్విట్టర్‌లో తనదైన శైలిలో రెస్పాండ్‌ అవుతుండడం విశేషం.

తాజాగా కేటీఆర్‌ ప్రశంసలు తమన్‌ దక్కించుకున్నాడు. మరోవైపు విడుదలైన నాటి నుండీ 'సామజవరగమనా..' సాంగ్‌ 100 కోట్ల పై చిలుకు రియల్‌ టైమ్‌ వ్యూస్‌తో రికార్డు సృష్టిస్తూ, యూ ట్యూబ్‌ ట్రెండింగ్‌లో మొదటి స్థానంలో నిలిచింది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS