కిరాక్ పార్టీ సినిమా ట్రైలర్ విడుదల కావడం దానికి కిరాక్ రేస్పంసే రావడంతో కిరాక్ పార్టీ మూడ్ లో ఉన్న నిఖిల్ మరో రీమేక్ చిత్రం చేయడానికి ఒప్పుకున్నట్టు సమాచారం.
వివరాల్లోకి వెళితే, తమిళంలో విజయవంతమైన కనితన్ చిత్రాన్ని తెలుగు లో రీమేక్ చేయనున్నారు. ఇక ఈ రీమేక్ లో నిఖిల్ నటించనున్నట్టు తెలుస్తున్నది, తమిళ మాతృక కి దర్శకత్వం వహించిన దర్శకుడే ఈ తెలుగు వెర్షన్ కి సైతం దర్శకత్వం వహించనున్నట్టు సమాచారం.
ఇక ఈ చిత్రంలో నిఖిల్ సరసన క్యాథరిన్ థెరిస్సా నటించనుందట. ఇప్పటికే పలు విజయవంతమైన చిత్రాలలో నటించిన క్యాథరిన్ త్వరలోనే మరోసారి తన అందం-అభినయంతో ప్రేక్షకులని అలరించనుంది.
కిరాక్ పార్టీ చిత్రం షూటింగ్ కూడా అయిపోవడంతో త్వరలోనే ఈ రీమేక్ చిత్రానికి సంబందించిన షూటింగ్ కూడా మొదలవనుంది.