వెబ్‌సైట్‌లోంచి వర్మ రూపొందించిన 'జీఎస్‌టీ' వీడియోని తొలగించారంటూ ప్రచారం జరుగుతోంది. అయితే విమియో సంస్థ వెబ్‌సైట్ నుండి మాత్రమే ఈ వీడియోని తొలగించడం జరిగింది. ఎందుకంటే అది పైరసీలాంటిది కాబట్టి. కానీ ముందుగా అనుకున్నట్లుగానే వర్మ 'గాడ్ సెక్స్ అండ్ ట్రూత్' వెబ్‌సైట్‌లో మాత్రం అందుబాటులోనే ఉంది. ఈ విషయాన్ని తాజాగా వర్మ వెల్లడించారు.
డబ్బులు చెల్లించి యధావిధిగా ఆ వెబ్‌సైట్‌లో వర్మ 'జీఎస్‌టీ' వీడియోని బ్రహ్మాండంగా వీక్షించొచ్చు. ఇప్పటికే ఈ వీడియోకి వ్యూస్ చాలా బాగా వస్తున్నాయట. దాంతో రెండో 'జీఎస్‌టీ'కి వర్మ రెడీగా ఉన్నాడు. అయితే ఎవరితో ఆ వీడియోని తెరకెక్కించాలా అనే ఆలోచనలో ఉన్నారట వర్మ. అంటే ఈ వీడియో కోసం వర్మ మళ్లీ ఏదో సెన్సేషనల్ టాపిక్ రైజ్ చేసేలానే ఉన్నారనీ అర్ధమవుతోంది. అయితే ఆల్రెడీ రామ్‌గోపాల్ వర్మ ఈ వీడియోని రెడీ చేసి పెట్టేసారనీ మరో పక్క ప్రచారం జోరుగా సాగుతోంది. త్వరలోనే విడుదల చేసేందుకు చూస్తున్నాడనీ గాసిప్స్ వస్తున్నాయి.
చూడాలి మరి నిజంగానే 'జీఎస్‌టీ 2'ని వర్మ ఆల్రెడీ షూట్ చేశాడా? లేక ఇవన్నీ జస్ట్ గాసిప్సేనా అనేది తేలాలి. అయితే నిప్పు లేనిదే పొగ రాదు కదా. అలా కూడా అర్ధం చేసుకోవాలి. ఏది ఏమైతేనేమి. ఎన్ని వివాదాలు చుట్టుముట్టినా, అనుకున్నట్లుగానే వర్మ 'జీఎస్‌టీ'ని విడుదల చేశాడు. అలాగే వర్మ అనుకుంటే 'జీఎస్‌టీ 2' కూడా వచ్చేస్తుంది. ఈ జీఎస్‌టీ సంగతి పక్కన పెడితే, వర్మ తెరకెక్కించాల్సిన తెలుగు సినిమాలు రెండు పెండింగ్‌లో ఉన్నాయి. అందులో ఒకటి నాగార్జునతో తెరకెక్కిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ కాగా, మరోటి ఎన్టీఆర్ బయోపిక్. వీటిలో నాగార్జున సినిమా షూటింగ్ దశలో ఉంది.