టాలీవుడ్ లో చాలామంది దర్శకులకు ద్వితీయ వీఘ్నం ఎఫెక్ట్ ఉంది. అంటే.. తొలి సినిమాతో హిట్టు కొట్టి, రెండో సినిమాతో బోల్తా కొడతారన్నమాట. చాలామంది దర్శకుల విషయంలో ఇది నిజమౌంది. ఇప్పుడు ఈ జాబితాలో మరో దర్శకుడు చేరాడు. తనే స్వరూప్. ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయతో సూపర్ హిట్టు కొట్టాడు స్వరూప్. తన రెండో సినిమా `మిషన్ ఇంపాజిబుల్` అనగానే.. చాలా ఆసక్తి ఏర్పడింది. తాప్సిని కథానాయికగా ఎంచుకోవడం, ముగ్గురు పిల్లలతో ఈ కథని నడపడంతో ఇంట్రెస్ట్ జనరేట్ అయ్యింది. తీరా చూస్తే.. ఈ సినిమా ఫ్లాప్. శుక్రవారం విడుదలైన ఈ సినిమాకి అన్ని చోట్ల నుంచీ నెగిటీవ్ టాక్, రివ్యూలే వచ్చాయి. వసూళ్లు కూడా ఏమాత్రం బాగాలేవు. `ఏజెంట్` తీసిన దర్శకుడేనా ఈ సినిమా తీసింది? అనిపించింది. ద్వితీయ వీఘ్నం ప్రమాదంలో... స్వరూప్ కూడా పడిపోయాడు.
ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ కథ.. చాలా పట్టుగా సాగుతుంది. స్క్రీన్ ప్లే బాగుంటుంది. సెకండాఫ్‌లో చిన్నచిన్న లోపాలున్నా... నవీన్ పొలిశెట్టి యాక్టింగ్ స్కిల్స్ తో చాలా కవర్ చేసేశాడు. అయితే ఆ ఛాన్స్.. `మిషన్ ఇంపాజిబుల్`కి దక్కలేదు. తాప్సి ఇందులో కేవలం అతిథి పాత్ర మాత్రమే. ముగ్గురు పిల్లలూ బాగానే చేసినప్పటికీ.. ఈకథని మోసేంత బలం వాళ్లకు లేదు. పైగా కథలో మలుపులేం లేవు. లాజిక్‌లకు అందని సీన్లతో బోర్ కొట్టించాడు దర్శకుడు. మొదటి సినిమా ఎంత ప్రేమగా తీస్తారో, ఎన్ని జాగ్రత్తలు తీసుకుని చేస్తారో, రెండో సినిమా కూడా అలానే చేయాలి. తొలి సినిమాతో హిట్టు కొట్టేశాం కదా, ఇక ఆడిందే ఆట - పాడిందే పాట - తీసిందే సినిమా అనుకుంటే ఎలా? అలా అనుకుంటే ఇలాంటి ఫలితాలే వస్తాయి.