అలనాటి మేటి నటి మహానటి సావిత్రి జీవితాన్ని ఆధారం చేసుకుని తీసిన మహానటి చిత్రం నిన్న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. విడుదలైన అన్ని చోట్ల నుండి ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వస్తున్నది, కలెక్షన్స్ పరంగా కూడా ఈ చిత్రం బాగానే వసూళ్ళు సాదిస్తున్నట్టు సమాచారం.
ఇక ఇవన్ని పక్కన పెడితే, ఈ చిత్రంలో ఒక చిన్న తప్పు దోర్లినట్టుగా అర్ధమవుతున్నది. అదేంటంటే- ఒక సన్నివేశంలో గోరింటాకు చిత్రం షూటింగ్ లో ఉన్న నటి సావిత్రిని ప్రఖ్యాత నటుడు SV రంగారావు కలవడం జరిగినట్టుగా చూపించారు. అయితే సావిత్రి నటిస్తునట్టుగా చూపిన గోరింటాకు చిత్రం 1979లో రాగ SV రంగారావు అప్పటికే మరణించి 5 ఏళ్ళు అవుతున్నది, ఆయన 1974లో కాలం చేశారు.
అయితే కారణాలు ఏంటో తెలియదు కాని దర్శక-నిర్మాతలు ఈ పొరపాటుని గమనించలేకపోయారు. ఇదిలావుండగా, ఇటువంటి బయోపిక్స్ ని తీయడం కత్తిమీద సాము వంటిది అని ఇలా కొన్ని కొన్ని తప్పులు తెలియకుండానే జరిగిపోతుంటాయి అన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతున్నది.
అయినా నిండు చందమామలో అక్కడక్కడ చిన్న మచ్చలు ఉన్నట్టు ఇంతటి మంచి చిత్రంలో ఇలాంటి ఒక చిన్న పొరపాటు పెద్ద లెక్కలోకి రాదు.