హీరోయిన్లు పెదవి విప్పుతున్నారు. సినీ రంగంలో తాము ఎదుర్కొనే విమర్శలపై ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు సినీ పరిశ్రమలకు చెందిన నటీమణులు పెదవి విప్పుతుండగా ఆ లిస్టులోకి అందాల చందమామ కాజల్ అగర్వాల్ కూడా చేరిపోయింది. కెరీర్ తొలినాళ్ళలో దర్శకులు ఏం చెబితే అది చేయాల్సి ఉంటుందనీ, ఏ హీరోయిన్ అయినా ఈ సమస్య నుంచి తప్పించుకోలేదని చెప్పింది కాజల్ అగర్వాల్. మొదట్లో తాను కూడా అలా చేయాల్సి వచ్చిందంటున్న కాజల్, ఇప్పుడు మాత్రం అలాంటి ఛాన్స్ ఎవరికీ ఇవ్వబోనని స్పష్టం చేసింది. ఇండస్ట్రీలో కూడా ఇదివరకటితో పోల్చితే ఇప్పుడెన్నో మార్పులు వచ్చినట్లు చెప్పింది కాజల్ అగర్వాల్. అయితే అన్ని రంగాల్లో ఉన్నట్లే వివక్ష సినీ పరిశ్రమలో కూడా కొంత ఉండొచ్చేమో అంటున్న సినీ ప్రముఖులు దాన్ని బూతద్దంలో చూపడం తగదని చెప్పడం జరుగుతోంది. అవకాశాలు అంది పుచ్చుకోవడం కోసం దర్శకుడు చెప్పినట్టల్లా చేసి, ఇప్పుడు అది తప్పుడు పని అన్నట్లుగా మాట్లాడటంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. దర్శకుడు, నిర్మాత ఓ సినిమా అనుకున్నప్పుడు ఆ సినిమా గురించి పూర్తిగా నటీనటులకు చెప్తారు గనుక, అభ్యంతరాలేమైనా ఉంటే అప్పుడే వాటిని చెప్పవలసి ఉంటుందని సీనియర్ సినీ ప్రముఖులు అభిప్రాయం వెలిబుచ్చుతున్నారు.