బాలీవుడ్ ప్రముఖులపై వరుసగా ఆరోపణలు చేస్తున్న ముద్దుగుమ్మ తనూశ్రీ దత్తాపై తాజాగా మరో కేసు నమోదైంది. తమకు సంబంధం లేని విషయాల్లోకి తమకు లాగినందుకు ఆమెపై పరువు నష్టం దావా వేస్తూ, ఆమెపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు డిమాండ్ చేస్తూ మహారాష్ట్ర నవ నిర్మాణ సేన ఓ కేసు ఫైల్ చేసింది.
తనపై ఈ సేన దాడి చేసిందనే విమర్శలు చేసింది తనూశ్రీ దత్తా. దాంతో వెంటనే రియాక్ట్ అయిన ఎంఎన్‌ఎస్ వారు ఆమెపై కేసు పెట్టారు. ఇప్పటికే తనూశ్రీ నుండి ఆరోపణలు ఎదుర్కొంటున్న నానా పటేకర్, వివేక్ అగ్నిహోత్రి తదితర బాలీవుడ్ ప్రముఖులు ఆమెపై కేసులు నమోదు చేశారు. ఆమె ఆరోపణలపై ఆల్రెడీ మీడియాలో క్లారిటీ ఇచ్చిన నానా పటేకర్, త్వరలోనే ఓ ప్రెస్ మీట్ నిర్వహించి, పూర్తి డీటెయిల్స్‌తో ఆడియన్స్‌కి వివరణ ఇస్తానని పేర్కొన్నారు.
ఈ విషయంలో తనూశ్రీ దత్తాకి కొందరు సపోర్ట్ చేస్తుండగా, మరికొందరు దారుణంగా విమర్శిస్తున్నారు. ఏది ఏమైనా మొన్నటి వరకూ టాలీవుడ్‌ని కుదిపేసిన శ్రీరెడ్డి ఆరోపణల పర్వం ఇప్పుడు తనూశ్రీ దత్తా కారణంగా బాలీవుడ్‌లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. టాలీవుడ్‌లో శ్రీరెడ్డి ఉదంతం అలా ముగిసిపోయింది.
మరి బాలీవుడ్‌లో తనూశ్రీ దత్తా ఆరోపణలకు ఎలా శుభం కార్డు పడుతుందో చూడాలిక.