బరోజ్ మూవీ రివ్యూ & రేటింగ్‌

మరిన్ని వార్తలు

చిత్రం: బరోజ్
దర్శకత్వం: మోహన్ లాల్
కథ - రచన: మోహన్ లాల్

నటీనటులు: మోహన్ లాల్, మాయా రావు వెస్ట్, సీజర్ లోరెంటే రాటన్, నెరియా కామాచో, డేనియల్ కాల్టాగిరోన్, తుహిన్ మీనన్,సాజు నవోదయ,గురు సోమసుందరం తదితరులు.


నిర్మాతలు: ఆంటోనీ పెరంబవూరు 


సంగీతం: మార్క్ కిలియన్, పెర్నాండో గేరీరో, మిగ్యుల్ గెరీరో, లిడియన్        
సినిమాటోగ్రఫీ : సంతోష్ శివన్ 
ఎడిటర్: బి. అజిత్ కుమార్  


బ్యానర్: ఆశీర్వాద్ సినిమాస్  
విడుదల తేదీ: 25 డిసెంబరు 2024 
 


ఐక్లిక్ మూవీస్ రేటింగ్‌: 2/5

 

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ పేరు తెలియని వారు ఉండరు. మోహన్ లాల్ తెలుగులో కూడా కొన్ని సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మణిరత్నం లాంటి దర్శకుఢుతో నైంటీస్ లోనే వర్క్ చేసారు. 'ఇద్దరు' మూవీతో పాన్ ఇండియా  హీరో గా గుర్తింపు తెచుకున్నారు. ఈ మధ్య తెలుగులో జనతా గ్యారేజ్, మనమంతా లాంటి తెలుగు సినిమాల్లో నటించారు. రజనీ కాంత్ తో జైలర్ మూవీలో నటించారు. పాన్ ఇండియా లెక్కలు రాకముందే  మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీభాషల్లో నటించి మంచి గుర్తింపు  తెచుకున్నారు. నాలుగు వందలకు పైగా సినిమాల్లో నటించిన మోహన్ లాల్ తాజాగా 'బరోజ్ త్రీడీ' అనే పాన్ ఇండియా మూవీకి  దర్శకుడిగా మారారు. మెగా ఫోన్ పట్టి తనని తానే హీరో గా మలుచుకున్నారు. క్రిస్మస్ సందర్భంగా ఈ రోజు థియేటర్స్ లో వరల్డ్ వైడ్ గా 'బరోజ్' మూవీ రిలీజ్ అయ్యింది. మలయాళం, తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ భాషల్లో రిలీజ్ అయిన ఈ ఫాంటసీ ఫిల్మ్ ఎలా ఉందో పాన్ ఇండియా ఆడియన్స్ ని ఆకట్టుకుందో లేదో చూద్దాం.  


కథ :
గోవాలో సామ్రాజ్యాన్ని విస్తరించిన పోర్చుగీసు రాజు డ గామా (ఇగ్నాసియో మతయోస్)కు బరోజ్ (మోహన్ లాల్) నమ్మిన బంటు. నాలుగు వందల ఏళ్లుగా గోవాలోని రాజ వంశానికి చెందిన నిధిని కాపాడుతూ ఉంటాడు. డ గామా వారసులు వస్తే వాళ్లకు అప్పగించాలని చూస్తూ ఉంటాడు. రాజ వంశంలో పదమూడో తరానికి చెందిన ఇసాబెల్లా (మాయా రావు వెస్ట్). తండ్రి రాన్ మాథ్యూ (తుహిన్ మీనన్)తో కలిసి గోవా వస్తుంది. అయితే ఇన్నాళ్లు రాజవంశానికి చెందిన వాళ్ళు వస్తే నిధిని అప్పగించాలని చూసిన బరోజ్ ఇసబెల్లాకు నిధిని అప్పగించాడా? లేదా? అసలు ఇసాబెల్లాకి తానొక రాజ వంశస్థురాల్ని అనే సంగతి తెలుసా? లేదా? నిధిని రక్షించే క్రమంలో బరోజ్ ఎదుర్కొన్న అడ్డంకులు? ఆ నిధి కోసం దుష్టశక్తులు చేసిన ప్రయత్నాలు? ఇసాబెల్లాకు మాత్రమే బరోజ్ ఎందుకు కనిపిస్తాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.   


విశ్లేషణ: 
నేటి జనరేషన్ కి చందమామ కథలు తెలియదు కానీ నైంటీస్ జనరేషన్ కి చందమామ కథలు పరిచయమే. అలాంటి కథలా ఉంటుంది బరోజ్ మూవీ. నేటి జనరేషన్ కి అర్థం అయ్యేలా చెప్పాలంటే హాలీవుడ్ కార్టూన్ డబ్బింగ్ మూవీలా ఉంటుంది. 'బరోజ్' మూవీ టోటల్ గా  సౌత్ లో వచ్చిన మూవీలా కాకుండా హాలీవుడ్ మూవీ ఫీల్ ఇస్తుంది. అందుకే సినిమా ఎపుడెపుడు అవుతుందా అనిపిస్తుంది. టాలీవుడ్ సూపర్ స్టార్  మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్‍‌తో 'బరోజ్' మొదలవుతుంది. ఫాదో గీతంతో ఈసినిమాని ప్రారంభిద్దామని అంటారు. అసలు ఫాదో గీతం అంటే ఏంటి అని అయోమయంలో ఉండగానే పోర్చుగీస్ పాట తెరపై కనిపిస్తుంది. నిధిని కాపాడే భూతంలా బరోజ్ ఎంట్రీ, నిధి తాలూకా కథ, ఆ నిధితో బరోజ్ కి సంబంధం ఏంటి? బరోజ్ ఎందుకు దెయ్యంగా మారాడు? ఈ నిధిని ఎవరికి అప్పగించాలి అనే అంశాలతో ఈ మూవీ సాగుతుంది. 400 ఏళ్లుగా ఒకే గదిలో నిధికి కాపలాగా ఒక భూతం ఉండటం, నిధిని  కొట్టేయడానికి వస్తే వారిని ఆపే సీన్లను చాలా బాగా ఫన్నీ గా ప్రజంట్ చేయొచ్చు. కానీ అదేం లేదు. కన్ఫ్యూజన్ గా అనిపిస్తుంది. బరోజ్ పాత్రధారి అయిన మోహన్ లాల్ కూడా అప్పుడప్పుడు కనిపిస్తూ కథలో ఆసక్తి లేకుండా చేసాడు.  పాన్ ఇండియా సినిమా అయినా  ఒక్క మోహన్ లాల్ తప్ప ఎవరూ తెలియదు. ప్రజంట్ వస్తున్న పాన్ ఇండియా సినిమాలన్నీ అన్ని భాషల యాక్టర్స్ తో కలిసి వర్క్ చేస్తూ, ఆయా భాషలవారిని ఎంటర్టైన్ చేస్తున్నారు కానీ బరోజ్ లో మొత్తం మలయాళీ నటులు, విదేశీ నటులే ఉన్నారు. సేమ్ హాలీవుడ్ ఫిలిం చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది.    


మోహన్ లాల్ బరోజ్ పాత్రలో మాయలు, మ్యాజిక్ చేసి ఆసక్తి పెంచొచ్చు, భలే ఉందే అనిపించే సీన్ ఒక్కటీ లేకపోవటం ఆడియన్స్ డిస్పాయింట్ అవుతారు. పైగా మాటలు కూడా ఎక్కువ భాగం పోర్చుగీస్‌లో ఉండటం మైనస్. హాలీవుడ్ సినిమాల స్పూర్తితో మోహన్ లాల్ బరోజ్ తీసినట్లు తెలుస్తోంది. ప్రాంతీయ ప్రేక్షకులని ద్రుష్టిలో పెట్టుకోలేదు. నేటివిటీ లేకపోవటం వలన ఆడియన్స్ కథలో ఇన్వాల్వ్ కాలేక పోయారు. అసలు ఈ కథకి పోర్చుగీస్ బ్యాక్ డ్రాప్ అనవసరం అనిపిస్తుంది. మన ప్రాంత జానపద కథల్లో అనేకం కనిపిస్తాయి. అది ప్రాంతీయ ఆడియన్స్ మెచ్చే విధంగా ఉండి ఉండేవి. త్రీడీ మూవీతో ప్రేక్షకుల్నిమెప్పించాలని చూసిన మోహన్ లాల్, కంటెంట్‌పై దృష్టి పెట్టలేదు. దీనితో  మోహన్ లాల్ పాన్ ఇండియా ప్రయత్నం బెడిసికొట్టింది.   


నటీ నటులు:
బరోజ్ పాత్రలో మోహన్ లాల్ లో నటనని వంక పెట్టడానికి లేదు. కాకపోతే బరోజ్ పాత్ర స్క్రీన్ మీద కనిపించిందే తక్కువ. అందుకే నటనకి స్కోప్ ఎక్కువగా లేదు. మోహన్ లాల్ లో నటుడ్ని దర్శకుడు డామినేట్ చేశాడు. హీరోయిజానికి, కామెడీకి దేనికి ఆస్కారం లేకుండా చేసాడు. మోహన్ లాల్ నట విశ్వరూపానికి ఎక్కువ చాన్స్ రాలేదు. వేరే దర్శకులే నయం మోహన్ లాల్ లో ఉన్న నటుడ్ని ఫుల్ గా వాడుకున్నారు. కానీ తన నటనని మోహన్ లాల్ వాడుకోలేకపోయారు.  కథలో కీలక పాత్ర పోషించిన ఇసాబెల్లా నటన పరంగా కంటే అందం తో మెప్పించింది. మిగతా  వాళ్లంతా ఫార్నర్స్ ఉన్నారు. వారి వారి పాత్రల మేరకు నటించారు. 


టెక్నికల్ :
నటుడిగా ఇప్పటివరకు మెప్పించిన మోహన్ లాల్ దర్శకుడిగా మొదటి ప్రయత్నం లోనే ఫెయిల్ అయ్యాడు. ఈవెన్ మోహన్ లాల్ ఫాన్స్ కి కూడా ఈ మూవి నచ్చదు. మోహన్ లాల్ పోర్చుగీసు వారిని మెప్పించేలా సినిమా తీసాడు అనటంలో సందేహం లేదు. సంతోష్ శివన్ సినిమాటోగ్రఫీ బావుంది. అండర్ వాటర్ సీక్వెన్సులో త్రీడీ విజువల్స్ బాగానే ఉన్నాయి. సాంగ్స్, రీ రికార్డింగ్ తెలుగు డబ్బింగ్‌ కుదరలేదు. ఒక ఇంగ్లీష్ మూవీ తెలుగులో చూస్తున్నట్టు ఉంది. కొన్ని పాటలు విసుగు తెప్పించాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ అద్భుతంగా డిజైన్ చేసారు. కొన్ని చోట్ల మరీ బ్రైట్ గా, ఇంకొన్ని చోట్ల మరీ డార్క్ గా ఉండటం వలన త్రీడీ ఎఫెక్ట్ కూడా మైనస్ అయ్యింది. 


ప్లస్ పాయింట్స్ 
మోహన్ లాల్ 
కథ  
టెక్నికల్


మైనస్ పాయింట్స్ 
పోర్చుగీసు భాష 
దర్శకత్వం
తెలియని నటులు          


ఫైనల్ వర్దిక్ట్ : బోర్ కొట్టించిన 'బరోజ్'..


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS