సుక్కు సినిమాపై విరక్తికి కారణం పుష్ప 2 వివాదమా ?

మరిన్ని వార్తలు

సుకుమార్ అంటే ఇప్పుడొక బ్రాండ్. అది పుష్ప తెచ్చిన ఫేమ్. మొన్నటివరకు టాలీవుడ్ లో ముద్దుగా లెక్కలు మాస్టర్ అని పిలుపించుకునే సుకుమార్ ఇప్పుడు తన మేకింగ్ తో ఇంటర్నేషనల్ లెవెల్ లో గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా సుకుమార్ అమెరికా వెళ్లారు. రామ్ చరణ్ నటించిన 'గేమ్ ఛేంజర్' ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం గెస్ట్ గా సుకుమార్ అటెండ్ అయ్యారు. చెర్రీతో సుకుమార్ కి ఉన్న అనుబంధం, పైగా నెక్స్ట్ సుకుమార్ చెర్రీ తో వర్క్ చేయనుండటంతో ఈ ఈవెంట్ కోసం అమెరికా వెళ్లారు సుకుమార్.

సుకుమార్ పుష్ప 2 తరువాత చెర్రీతో ఒక మూవీ అనౌన్స్ చేశారు. నెక్స్ట్ పుష్ప3 కూడా ఉంది. సుకుమార్ మేకింగ్ పై భారీ అంచనాలు నెలకొన్న ఈ తరుణంలో ఊహించని షాక్ ఇచ్చారు సుక్కు. ఈ ఈవెంట్లో సుకుమార్ ఒక వేళ వదిలేయాల్సి వస్తే సినిమాలు వదిలేస్తా అన్నారు. ఎందుకు ఏంటి అనేది చూస్తే. ఈ ఈవెంట్ కి యాంకర్ గా వ్యవహరించిన సుమ, సుకుమార్ ని 'దోప్' అనే పదంతో ఒకటి వదిలెయ్యాలి అంటే ఏం వదిలేస్తారు అని ప్రశ్నించింది. వెంటనే సుక్కు సినిమాలు అని టక్కున చెప్పాడు. సుకుమార్ లాంటి పర్ఫెక్ట్ మేకర్ అంత సింపుల్ గా సినిమాలకి దూరం అవుతా అనటం పలువుర్ని ఆశ్చర్యానికి గురి చేసింది.

సినిమా అంటే ప్రాణం ఇచ్చే వాళ్ళు ఉంటారు. ఒక్క హిట్ కోసం అహర్నిశలు శ్రమిస్తారు. అలాంటిది కొన్ని ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటూ ఎత్తు పల్లాలు చూస్తూ ఇప్పుడొక గుర్తింపు తెచ్చుకున్న సుకుమార్ ఇలా చెప్పటం జీర్ణించుకోలేకపోతున్నారు ఫాన్స్. పక్కనే ఉన్న చెర్రీ కూడా సుక్కు సమాధానం విని షాక్ అయినట్లు తెలుస్తోంది. సుకుమార్ లో సడెన్ గా సినిమాపై ఎందుకింత విరక్తి వచ్చింది అన్న చర్చ జరుగుతోంది. ఒక వేళ పుష్ప2 వివాదం సుక్కుతో ఇలా మాట్లాడించిందా అని కొందరు అంటున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS