ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ ఇంట్లో దొంగతనం జరగడం ఇప్పుడు టాక్ అఫ్ ది టౌన్ గా మారింది.
వివరాల్లోకి వెళితే, హైదరాబాద్ లోని మణిశర్మ ఇంటిలో దొంగతనం జరిగింది. ఈ విషయమై ఆయన మేనేజర్ బంజారాహిల్స్ పోలీసులని ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులో వారు చెప్పినదాని ప్రకారం, కొన్ని రోజుల క్రితం తమ బీరువాలో రూ 4లక్షల నగదుని భద్రపరిచినట్టు అయితే నిన్న అవసరాల నిమిత్తం ఆ డబ్బు కోసం వెతకగా అవి దొరకపోయే సరికి దొంగతనం జరిగిందని భావించి పోలీసులకి సమాచారం అందచేశారు.
వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఇంటిలోని బీరువాలో డబ్బు పోవడంతో కచ్చితంగా ఇది వారికి పరిచయం ఉన్న వారి పనే అని పోలీసులు ఒక నిర్ధారణకి వచ్చినట్టుగా తెలిసింది.
త్వరలోనే ఈ కేసుని చేదిస్తామని పోలీసులు కూడా హామీ ఇవ్వడం జరిగిందట.