మోహన్ బాబు ఇంట విషాదం

By iQlikMovies - October 24, 2017 - 12:51 PM IST

మరిన్ని వార్తలు

మంచు మోహన్ బాబు ఇంట విషాదం నెలకొంది.

మోహన్ బాబు సోదరి విజయలక్ష్మి గారి భర్త మేడసాని వెంకటాద్రి నాయుడు (55) గారు నిన్న రాత్రి 8.30 గంటలకు గుండెపోటుతో మరణించారు. ఆయన గతంలో మోహన్ బాబు హీరోగా నటించిన పలు చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు.

ప్రస్తుతం ఆయన మోహన్ బాబు గారు స్థాపించిన శ్రీ విద్యానికేతన్ కళాశాలలో కోశాధికారిగా ఉన్నారు. ఇక ఆయన మృతికి పలువురు సినీ ప్రముఖులు, మంచు కుటుంబ శ్రేయోభిలాషులు తమ సంతాపాన్ని తెలియచేశారు.

మేడసాని వెంకటాద్రి నాయుడు అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం 4గంటలకు జరగనున్నాయి.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS