గత కొంతకాలంగా ధియేటర్ లో జాతీయ గీతాన్ని వేయడం తప్పనిసరి చేసినప్పటి నుండి ఎక్కడో ఒకచోట వివాదాలు జరుగుతూనే ఉన్నాయి.
ఈ అంశం పై సుప్రీమ్ కోర్టులో దాఖలైన వ్యాజ్యం పై సుప్రీమ్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి అయిన దీపక్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య కమిటి తన తీర్పు వెల్లడించింది. ధియేటర్ లలో జాతీయ గీతం వచ్చే సమయంలో అందరు తప్పనిసరిగా లేచి నిలబడాలి అన్న నిబందన ఏమి విధించలేము అని అలాగే వారు నిలుచుంటేనే వారికి దేశ భక్తి ఉన్నట్టుగా నిర్దారించలేము అన్న అభిప్రాయం వ్యక్తపరిచింది ధర్మాసనం.
ఈ తీర్పుతో సినిమా ధియేటర్ లో జాతీయ గీతం వచ్చే సమయంలో కచ్చితంగా అందరు నిలబడాలా వద్దా అన్న దాని పైన ఒక క్లారిటీ వచ్చినట్టుగా భావించవచ్చు.
అయితే ఈ తీర్పుని సవాలు చేస్తూ కేంద్ర తరపున అటార్నీ జనరల్ వేణుగోపాల్ వాదిస్తూ- జాతీయ గీతాన్ని గౌరవించాల్సిన ఆవశ్యకత ఉందని దానివల్లే దేశంలోని ప్రజలంతా ఐక్యంగా మెలిగే వాతావరణం పెరుగుతుంది అన్న అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఈ అంశంలో తుది నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వానికే వదిలేయాలని విజ్ఞప్తి చేశారు.
దీని పై విచారణను జనవరి 9వ తేదీకి ధర్మాసనం వాయిదా వేసింది.