నాని- అతితక్కువ కాలంలోనే చాలా మంచి విజయాలు అందుకున్న యంగ్ హీరో. అయితే ఆయన నిర్మించిన అలాగే హీరోగా నటించిన రెండు చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి.
ఇక దీనితో ఆయన ఇప్పటికే ఒప్పుకున్న చిత్రాల కథలని కూడా మళ్ళీ ఒకసారి సమీక్షించనున్నట్టుగా తెలిసింది. అందులో భాగంగానే దర్శకుడు విక్రమ్ కె కుమార్ తో చేయవలసిన కథని పక్కకి పెట్టినట్టుగా సమాచారం. కథ లో కొంత రిస్క్ కనపడడమే ఆయనని ఈ నిర్ణయం తీసుకునేలా చేసింది అని అంటున్నారు.
ఒక రెండు ఫ్లాపులకి ఇలా డీలా పడడం సరికాదు అని. కెరీర్ లో ఇలా ఫెయిల్యూర్స్ కూడా చాలా అతి సహజమే అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.
మొత్తానికి రెండు అపజయాలు నాని సినీ కెరీర్ కి ఒక బ్రేక్ లా మారిపోయాయి అని అనుకుంటున్నారు ఆయన ఫ్యాన్స్.