ప్రముఖ నటుడు మోహన్ బాబు చిరంజీవికి ఓ అరుదైన కానుక పంపారు. శనివారం తన పుట్టిన రోజు జరుపుకున్న చిరంజీవికి చెక్కతో చేసిన ఓ బైక్‌ని చిరుకి బహుమతిగా ఇచ్చాడు. ఈ విషయాన్ని ట్విట్టర్ లో తన అభిమానులతో పంచుకున్నారు చిరు. ''నా చిరకాల మిత్రుడు, తొలిసారి నా పుట్టినరోజునాడు, ఓ కళాకృతిని కానుకగా పంపాడు. ఆ కానుకలో అతని రాజసం, వ్యక్తిత్వం ఉట్టిపడుతున్నాయి'' అంటూ ట్వీట్ చేశారు చిరంజీవి.
మోహన్ బాబుతో చిరంజీవిది ప్రత్యేకమైన అనుబంధం. వీరిద్దరూ ఎప్పుడు కలిసినా.. అక్కడ వాతావరణం ఆహ్లాదకరంగా మారిపోతుంటుంది. టామ్ అండ్ జెర్రీలా కొట్టుకుంటూనే చూపరులకు వినోదం పంచిపెడుతుంటారు. వీరిద్దరి అనుబంధం.. మరోసారి ఈ బహుమతితో బయటపడింది. ఈ కళాకృతి బాగుందని, చిరుకి మంచి గిఫ్ట్ అందించారని మెగా ఫ్యాన్స్ మోహన్ బాబుని ట్విట్టర్ లో కృతజ్ఞతలు తెలుపుతున్నారు.