కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు, ఉగాది శుభాకాంక్షలు చెప్పారు సోషల్ మీడియా వేదికగా. అయితే, కాస్త భిన్నంగా, ఆసక్తికరంగా, ఆలోచింపజేసే విధంగా ఆయన ఓ మెసేజ్ పోస్ట్ చేశారు. ‘ప్రకృతిని కాపాడుకోండి.. పెద్దల మాటను గౌరవించండి. మీ ఇంటిల్లపాదికి శ్రీ శార్వరి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అందరూ అష్టైశ్వర్య, ఆయురారోగ్యాలతో వంద సంవత్సరాలు క్షేమంగా వుండాలని ఆ షిర్డీ సాయినాథుని కోరుకుంటున్నాను..’ అంటూ ట్వీట్ చేశారు మోహన్‌బాబు. ప్రస్తుతం ప్రపంచమంతా కరోనా దెబ్బకు విలవిల్లాడుతోంది. ప్రకృతికి మనం హాని చేయకుండా వుండి వుంటే, ఇలాంటి వైరస్‌లు వ్యాపించే అవకాశం చాలా తక్కువగా వుంటుంది.
ప్రకృతిని కాపాడుకోండి, పెద్దల మాటను గౌరవించండి. మీ ఇంటిల్లపాదికి శ్రీ శార్వరి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అందరూ అష్టైశ్వర్య, ఆయురారోగ్యాలతో వంద సంవత్సరాలు క్షేమంగా ఉండాలని ఆ షిర్డీ సాయి నాధుని కోరుకుంటున్నాను. #HappyUgadi #Ugadi #Ugadi2020
— Mohan Babu M (@themohanbabu) March 25, 2020
‘షేక్ హ్యాండ్ వద్దు.. నమస్కారమే ముద్దు..’ అనే పెద్దల సూక్తిని పాటిస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదు. అన్నిటికీ మించి పరిశుభ్రత విషయంలో పెద్దలు చెప్పిన మాటల్ని పెడ చెవిన పెట్టాం. ఆ విషయాల్నే మంచు మోహన్‌బాబు చాలా మంచి ఉద్దేశ్యంతో తన ట్వీట్ ద్వారా తెలియజేశారనుకోవాలి. కరోనా ప్రపంచాన్ని కబళించేస్తోన్న వేళ, సెలబ్రిటీలు తమ అభిమానులకు ధైర్యం చెబుతూ, ప్రజల్లో కరోనా వైరస్ పట్ల అవగాహన పెంచే కార్యక్రమాలు చేపడ్తుండడం అభినందనీయం. అందులోనూ మంచు కుటుంబం ఓ అడుగు ముందుకేసి, సేవా కార్యక్రమాల్లోనూ పాల్గొంటోంది.