ఎట్టకేలకు మహేష్ బాబు సినిమా ఓకే అయ్యింది. పరశురామ్ కథకు మహేష్ ఓకే చెప్పాడు. 14 రీల్స్, మైత్రీ మూవీస్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అయితే... కథ ఓకే చేసినా, షూటింగ్ మాత్రం ఆలస్యంగా మొదలయ్యే ఛాన్సుంది. ఈ చిత్రాన్ని మే - జూన్‌లలో మొదలెట్టాలని నిర్మాతలు భావిస్తున్నారు. కానీ మహేష్ ఆలోచన మాత్రం వేరుగా ఉంది. ఈ సినిమాని జులైలో మొదలెట్టాలని మహేష్ నిర్మాతలకు సూచించాడట. ఈలోగా మహేష్ తన కుటుంబంతోనే గడపబోతున్నాడు.
కరోనా ప్రభావం భారతదేశంపై తీవ్రంగా ఉంది. దాదాపు దేశం అంతా రెడ్ అలెర్ట్ లో ఉంది. పరిస్థితులు ఎప్పుడు చక్కబడతాయే తెలీదు. షూటింగులు మళ్లీ మొదలైనా ఇది వరకటి జోష్ కనిపించదు. ఇలాంటి పరిస్థితుల్లో సినమాని హడావుడిగా మొదలెట్టడం ఎందుకని మహేష్ బావిస్తున్నాడట. అందుకే జులై వరకూ ఇంటిపట్టునే ఉండాలని నిర్ణయం తీసుకున్నాడని టాక్. 2021 వేసవిలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.