మోహన్‌ బాబు న్యూ లుక్‌: చిరంజీవి కోసమేనా?

మరిన్ని వార్తలు

విలక్షణ నటుడు మోహన్‌బాబు ఫోటోలు తాజాగా అంతర్జాలం లో దర్శనమిస్తున్నాయి. సరికొత్త లుక్స్‌లో మోహన్‌బాబు కనిపిస్తున్నారు ఈ ఫోటోస్‌లో. మెడలో పులిగోరు, రుద్రాక్షలు ధరించి క్యాజువల్‌ హెయిర్‌ స్టైల్‌, లైట్‌గా గెడ్డంతో కనిపిస్తున్న మోహన్‌బాబు తాజా గెటప్‌ చిరు సినిమా కోసమే అని మాట్లాడుకుంటున్నారు. మెగాస్టార్‌ చిరంజీవి 152 వ సినిమాలో మోహన్‌బాబు కీక పాత్ర పోషిస్తున్నారంటూ ఇటీవల ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విడుదలైన ఈ ఫోటోలు ఆ మాటకి బలం చేకూరుస్తున్నాయి.

 

ప్రస్తుతం నెట్టింట్లో హల్‌ చల్‌ చేస్తున్న ఈ ఫోటోలకు మంచి రెస్పాన్స్‌ వస్తోంది. ఇదిలా ఉంటే కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిరు 152లో త్రిష హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా సెట్స్‌ మీదికెళ్లింది. రామ్‌ చరణ్‌ నిర్మాణంలో రూపొందుతోన్న ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్‌లో రిలీజ్‌ కానుంది. మరోవైపు మోహన్‌బాబు ప్రస్తుతం తమిళంలో సూర్య హీరోగా నటిస్తున్న సినిమాలో ఇంపార్టెంట్‌ రోల్‌ పోషిస్తున్నారు. ‘ఆకాశం నీ హద్దురా’ అనే టైటిల్‌తో ఈ సినిమా తెలుగులో విడుదలవుతోంది. ‘గురు’ ఫేమ్‌ సుధా కొంగర ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. అపర్ణ బాల మురళి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాని సూర్య తన హోమ్‌ బ్యానర్‌లో నిర్మిస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS