జ‌య‌హో సాహో: బాహుబ‌లి రికార్డుల‌కు బీట‌లు షురూ!

By iQlikMovies - June 13, 2019 - 20:00 PM IST

మరిన్ని వార్తలు

బాహుబ‌లి రికార్డుల్ని బ‌ద్ద‌లు కొట్టే సినిమా వ‌స్తుందా?  వ‌స్తే ఆ సినిమా ఏ స్థాయిలో ఉంటుంది? అనే చ‌ర్చ టాలీవుడ్‌లో జ‌రుగుతూనే ఉంది. ఆ రికార్డుల‌కు బీట‌లు వారే రోజులు ద‌గ్గ‌ర ప‌డ్డాయి. మ‌ళ్లీ ప్ర‌భాస్ సినిమానే - ఆ మాయాజాలం చేయ‌బోతోంది. ప్ర‌భాస్ కథానాయ‌కుడిగా న‌టించిన 'సాహో' వ‌ల్లే బాహుబ‌లి రికార్డులు చెల్లా చెదురుకాబోతున్నాయి. ప్ర‌భాస్ అభిమానుల‌కు ఇంత‌కంటే గుడ్ న్యూస్ ఏముంటుంది?

సాహో విడుద‌లై ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో తెలీదుగానీ, విడుద‌ల‌కు ముందే బాహుబ‌లి 1 రికార్డుని బ‌ద్ద‌లు కొట్టే అవ‌కాం ఇప్పుడు సాహో చేతుల్లోనే ఉంది. బాహుబ‌లి - ది బిగినింగ్ విడుద‌ల‌కు ముందే దాదాపు 150 కోట్ల బిజినెస్ జ‌రుపుకుంది. ఆరికార్డుని బాహుబ‌లి - ది క‌న్‌క్లూజ‌న్ బ‌ద్ద‌లు కొట్టింది. అయితే ఇప్పుడు బాహుబ‌లి 1 రికార్డుని సైతం - సాహో చెరిపేయ‌బోతోంది. ప్ర‌పంచ వ్యాప్తంగా సాహో దాదాపు 200 కోట్ల బిజినెస్ జ‌రుపుకోబోతోంద‌ని ట్రేడ్ వ‌ర్గాల టాక్‌. కేవ‌లం రెండు తెలుగు రాష్ట్రాల నుంచే థియేట‌రిక‌ల్ రైట్స్ రూపంలో సాహోకి 125 కోట్లు రాబోతున్నాయ‌ట‌.

ఓవ‌ర్సీస్‌, శాటిలైట్ క‌లుపుకుంటే మ‌రో 50 కోట్ల లెక్క తేలుతోంది. క‌ర్నాటక‌, బెంగ‌ళూరు నుంచి రూ.20 కోట్ల వ‌ర‌కూ వ‌చ్చే అవ‌కాశాలున్నాయి. బాలీవుడ్ లెక్క‌లు స‌రే స‌రి. మొత్తానికి విడుద‌ల‌కు ముందే ఈ సినిమా రూ.250 కోట్ల బిజినెస్ పూర్తి చేసుకోవ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. బాహుబ‌లి, బాహుబ‌లి 2, సాహో... ఇలా వ‌రుస‌గా వంద కోట్ల సినిమాలు ఇవ్వ‌డం, ద‌క్షిణాదిన ప్ర‌భాస్‌కే సాధ్య‌మైందేమో. ఈ ర‌కంగా ఇది కూడా ఓ రికార్డే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS