మలయాళ రీమేక్ `లూసీఫర్`పై చిరంజీవి దృష్టి పడిన సంగతి తెలిసిందే. `ఆచార్య` అవ్వగానే లూసీఫర్ ని పట్టాలెక్కించాలన్నది చిరు ప్లాన్. ఈ ప్రాజెక్టుపై దర్శకుడు వినాయక్ కొన్ని రోజులు పనిచేశారు. అయితే... సెకండాఫ్ ఎంతకీ ఓకే అవ్వకపోవడంతో వినాయక్ పక్కకు తప్పుకున్నారు. హరీష్ శంకర్ పేరు సైతం ప్రస్తావనకు వచ్చింది. అయితే హరీష్ కూడా ఖాళీ లేకపోవడంతో, మరో దర్శకుడ్ని వెదికి పట్టుకోవాల్సివచ్చింది.
ఇప్పుడు ఆ అవకాశం మోహన్ రాజాకి దక్కినట్టు తెలుస్తోంది. తమిళంలో మోహన్ రాజా మంచి క్రేజీ దర్శకుడు. తన ఆలోచనలు ఇంటిలిజెంట్ గా ఉంటాయి. తాను తీసిన `తని ఒరువన్` ఇందుకు ఉదాహరణ. ఆ సినిమాని తెలుగులో `ధృవ`గా రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు `తని ఒరువన్ 2` పనుల్లో బిజీగా ఉన్నాడు మోహన్. తనకి `లూసీఫర్` బాధ్యతలు అప్పగిస్తే ఎలా ఉంటుందా అని చిరు ఆలోచిస్తున్నాడట. అయితే ప్రస్తుతం ఈ ప్రతిపాదన చర్చల దశలోనే ఉంది. రీమేకులకు మోహన్ రాజా ఒప్పుకుంటాడా లేదా? అన్నది ప్రధానం.చిరుతో ఛాన్స్‌కాబట్టి మోహన్ నో చెప్పే అవకాశం లేనట్టే.