నేమూ, ఫేమూ అంత ఈజీగా రావు. వచ్చాయంటే... దాన్ని క్యాష్ చేసేసుకోవాల్సిందే. సినిమా వాళ్లు ఈ విషయాల్లో ఆరి తేరిపోయారు. మోనాల్ గజ్జర్ ని చూడండి. తను నాలుగైదు సినిమాలు చేసింది. కానీ తనని ఎవరూ పట్టించుకోలేదు. బిగ్ బాస్ లోకి అడుగుపెట్టగానే.. ఫేమస్ అయిపోయింది. ఈ షోలో విన్నర్ కాకపోయినా.. బాగానే సంపాదించుకుంది.
బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు రాగానే... `అల్లుడు అదుర్స్`లోని ఐటెమ్ గీతంలో నటించే ఛాన్స్ వచ్చింది. ఆ ఒక్క పాటకూ ఏకంగా 15 లక్షలు డిమాండ్ చేసింది. అడిగినంత ఇచ్చారు కూడా. ఇప్పుడు షాపింగ్ మాల్స్ లో తనదే సందడి. షాపింగ్ మాల్స్ ప్రారంభోత్సవాల్లో రిబ్బన్ కటింగ్ చేయడానికి... మోనాల్ బాగా డిమాండ్ చేస్తోందట. అక్కడ కేవలం ఒక్క గంటకు ఏకంగా 10 లక్షలు ఇచ్చుకుంటోందని టాక్. సినిమా సెలబ్రెటీలకు.. ఆ మాత్రం డిమాండ్ ఉంటుంది కూడా. కాకపోతే... ఇదంతా సినిమా వల్ల వచ్చింది కాదు. బిగ్ బాస్ షో వల్ల అందిన పాపులారిటీ. దాన్ని మోనాల్ బాగా క్యాష్ చేసేసుకుంటోంది.