'రాక్షసుడు' బజ్‌ పెరుగుతోంది.

By iQlikMovies - July 30, 2019 - 12:30 PM IST

మరిన్ని వార్తలు

ఆగస్ట్‌ 2న 'రాక్షసుడు' ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌ వేగవంతం చేశారు. హీరో, హీరోయిన్లు బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, అనుపమా పరమేశ్వరన్‌లు ప్రమోషన్స్‌లో జోరుగా పాల్గొంటున్నారు. తమిళ బ్లాక్‌ బస్టర్‌ 'రాక్షసన్‌'కి రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమా ప్రోమోస్‌ ఆసక్తికరంగా అనిపిస్తున్నాయి. థ్రిల్లర్‌ అంశాలు అందరికీ నచ్చుతాయి.

 

ఈ సినిమాలో థ్రిల్లింగ్‌ అంశాలు కూడా అంతే అసక్తికరంగా ఉండడంతో ఆడియన్స్‌ దృష్టి ఒకింత ఈ సినిమాపై పడిందనే చెప్పాలేమో. ఈ వారం 'రాక్షసుడు' సినిమాకి పోటీగా కార్తికేయ నటించిన 'గుణ 369' ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ రెండూ డిఫరెంట్‌ జోనర్‌ మూవీస్‌ కావడంతో, రెండింటితోనూ పోల్చితే, విడుదల దగ్గర పడిన ఈ తరుణంలో 'రాక్షసుడు'పై బజ్‌ పెరగడంతో, ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి.

 

'గుణ 369' కమర్షియల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌. ఇక థ్రిల్లింగ్‌ అంశాలు కావాలనుకునేవారికి 'రాక్షసుడు' స్పెషల్‌ ట్రీట్‌ ఇవ్వనుంది. అంతేకాదు, ప్రమోషన్స్‌లోనూ 'గుణ' వెనకబడడం, 'రాక్షసుడు'కి కలిసొచ్చిందనే చెప్పాలి. రమేష్‌ వర్మ దర్శత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో బెల్లంకొండ వపర్‌ ఫుల్‌ పోలీసాఫీసర్‌ పాత్రలోనూ, అనుపమా టీచర్‌ పాత్రలోనూ కనిపించనున్నారు. సైకో కిల్లర్‌ నేపథ్యంలో సాగే ఈ కథలో రాక్షసుడు ఎవరన్నది ఇంతవరకూ రివీల్‌ చేయలేదు. సినిమాలో మాత్రమే ఆ పాత్రకు పరిచయం దక్కుతుందేమో చూడాలిక.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS