2016 మోస్ట్‌ గ్లామరస్‌ విలన్‌

మరిన్ని వార్తలు

అరవింద్‌ స్వామి - రోజా సినిమాలో ఆయనను సౌత్‌ ఇండస్ట్రీ మొత్తం గుర్తు పెట్టుకుంటుంది. ఆ సినిమాతోనే ఆయన మొత్తం స్టార్‌డమ్‌ సంపాదించేశారు. అమ్మాయిలకే కాదు. అబ్బాయిలకు కూడా ఆయన అందం అసూయ పడేలా చేస్తుంది. అంత అందంగా ఉంటారు అరవింద్‌స్వామి. మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కింది ఈ సినిమా. అలాగే ఆయన డైరెక్షన్‌లో తెరకెక్కిన 'బొంబాయి' సినిమా కూడా హీరోగా ఆయన్ని ఓ స్థాయిలో నిలబెట్టిన సినిమాలు. అప్పుడు ఆయన్ని హీరోగా అంత గ్లామరస్‌ రొమాంటిక్‌ లుక్స్‌లో చూశారు సౌత్‌లోని జనం. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత షడెన్‌గా విలన్‌ అయ్యాడు. నిజానికి తమిళంలో 'తని ఒరువన్‌' చేశాడు. అది పెద్ద హిట్‌. దాన్ని తెలుగులో 'ధృవ' పేరుతో విడుదల చేశారు. విలన్‌గా 'తనీ ఒరువన్‌'లో ఆయన నటనకి మెచ్చి, తెలుగులో కూడా మరొకర్ని తీసుకునే సాహసం చేయకుండా ఆయన్నే ఒప్పించి తెలుగులోకి తీసుకొచ్చారు. ఆయన్ని తీసుకురావడమే సినిమాకి బాగా వర్కవుట్‌ అయ్యింది. మరొకర్ని తీసుకున్నా అంత సక్సెస్‌ రాదేమో తెలుగులో ఈ సినిమాకి. ఈ సినిమా కోసం ఆయన భారీ రెమ్యునరేషన్‌ అందుకున్నాడు. ఓ విలన్‌కి టాలీవుడ్‌లో అత్యధిక మొత్తం చెల్లించడం ఇదే ప్రథమం అని సమాచారమ్‌. 


విలన్‌ అంటే విలన్‌లా కాదు, అదో రకం. తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. తమిళం కన్నా అద్భుతంగా తన పాత్ర ఉందని స్వయంగా అరవింద్‌ స్వామి ఇప్పటికీ చెబుతున్నాడు. స్క్రీన్‌ప్లే పరంగా ఒరిజినల్‌తో పోల్చితే తెలుగులో వేగం ఎక్కువ. అరవింద్‌ స్వామిని ఇంకా స్టైలిష్‌గా చూపడంలో దర్శకుడు సురేందర్‌రెడ్డి సక్సెస్‌ అయ్యాడు. అయితే కొన్ని అనివార్య కారణాలతో సినిమా విడుదల ఆలస్యమయ్యింది. ఆ ఆలస్యానికి కారణం కూడా అరవింద్‌ స్వామి అని సమాచారమ్‌. మోస్ట్‌ గ్లామరస్‌ అండ్‌ హ్యాండ్సమ్‌ విలన్‌గా 'నాన్నకు ప్రేమతో' సినిమా ద్వారా జగపతిబాబు అందరి దృష్టినీ ఆకర్షించాడు. అయితే ఏడాది చివర్లో వచ్చిన 'ధృవ'తో జగపతిబాబుని దాటేశాడు అరవింద్‌ స్వామి. పొరుగింటి పుల్ల కూర మనకి రుచెక్కువ కదా. 


నిజానికి అరవింద్‌ స్వామి హీరోగా గ్యాప్‌ తీసుకున్న తర్వాత సెకండ్‌ ఇన్నింగ్స్‌ని 'కడలి' సినిమాతో ప్రారంభించాడు. సీనియర్‌ నటి రాధ కూతురు తులసీ నాయర్‌, సీనియర్‌ హీరో కార్తీక్‌ కుమారుడు గౌతమ్‌ కార్తిక్‌ జంటగా నటించిన సినిమా ఇది. ఇది కూడా మణిరత్నం దర్శత్వంలోనే తెరకెక్కింది. ఈ సినిమాలో అరవింద్‌ స్వామి చర్చ్‌ ఫాదర్‌గా ఓ పాత్రలో కనిపిస్తారు. కానీ ఆ సినిమా ఆశించిన విజయం అందుకోలేదు. దాంతో అరవింద్‌స్వామి పాత్ర కూడా అంతగా రిజిస్టర్‌ కాలేదు. ఆ తర్వాత మళ్లీ తమిళంలో 'తనీ ఒరువన్‌', తెలుగులో 'ధృవ' సినిమాతోనే ఆయన మునుపటి సక్సెస్‌ని అందుకున్నారు. మోస్ట్‌ హ్యాండ్‌సమ్‌ కదా ఎందుకు మీరు విలన్‌గా నటించడానికి ఒప్పుకున్నారు అని ఆయన్ని ఆడిగితే, నేను విలన్‌గా నటించానా, హీరోగా నటించానా అన్నది కాదు. ఆ పాత్రకి నేనెంత న్యాయం చేశాను అన్నదే నోట్‌ చేసుకోవాలి. నన్ను హీరోగా అభిమానించిన ప్రేక్షకులే నన్ను డిఫరెంట్‌ క్యారెక్టర్స్‌లో చూడాలని భావిస్తారు. అలా పాత్ర తేడా అంతే. కానీ వారి అభిమానంలో ఏమాత్రం తేడా ఉండదు అంటున్నారు అరవింద్‌స్వామి. తమిళంలో ఆర్య హీరోగా తెరకెక్కుతోన్న 'బోగన్‌' సినిమాలో అరవింద్‌ స్వామి నటిస్తున్నారు. 


తెలుగుకి టాటా చెప్పేశాడు: 'ధృవ' సినిమాతో టాలీవుడ్‌కి మరో హ్యాండ్‌సమ్‌ విలన్‌ దొరికాడంటూ పండగ చేసుకున్నారు మన టాలీవుడ్‌ దర్శక, నిర్మాతలు. అయితే బ్యాడ్‌ న్యూస్‌ ఏంటంటే అరవింద్‌ స్వామి ఇకపై తెలుగులో సినిమాలు చెయ్యనని సున్నితంగా చెప్పేశారు. ఎందుకు అలా అంటే నాకు భాష రాదు. భాష రాకపోతే పాత్రకు తగ్గ ఎక్స్‌ప్రెషన్స్‌ని కరెక్టుగా ఇవ్వలేను. తద్వారా ఆ పాత్రకి పూర్తి న్యాయం చేయలేను. అందుకే తమిళంలో మాత్రమే సినిమాలు చేస్తానంటున్నారు. కానీ 'ధృవ' సినిమా ఆయన్ని తెలుగు ప్రేక్షకులకి బాగా దగ్గర చేసేసింది. దాంతో అధిక రెమ్యునరేషన్‌ ఇచ్చి అయినా స్టార్‌ హీరోల సినిమాల కోసమైనా, ఎలాగోలా తెలుగులోకి లాక్కొచ్చేస్తారు మనవాళ్లు. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS