రాయ్ లక్ష్మీ కెరీర్‌లో 'జూలీ - 2' సినిమా ఓ స్పెషల్. బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తూనే ఇలాంటి బోల్డ్ కంటెన్ట్ మూవీతో ఆడుగు పెడుతోంది. ఈ సినిమా విడుదలకు ముందే రాయ్ లక్ష్మీ అక్కడ సంచలనం అయిపోయింది. ఇక సోషల్ మీడియాలో అమ్మడి గ్లామర్‌కి ఫాలోయింగ్ ఏ రేంజ్‌లో ఉందో లెక్కపెట్టడమే కష్టం. ఆ ప్రోత్సాహంతోనే రాయ్ లక్ష్మి సోషల్ మీడియాలో తన తళుకు బెళుకులకు మరింత మెరుపులద్దుతోంది. డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్లో ఫోటో సెషన్స్ చేయించుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది. దాంతో సోషల్ మీడియా రాయ్ లక్ష్మీ గ్లామర్‌తో కళకళలాడిపోతోంది. తాజాగా ఈ గ్రీన్ కలర్ కాస్ట్యూమ్‌లో రాయ్ లక్ష్మి దిగిన ఫోటో కెవ్వుకేక అనిపించేలా లేదూ. ఎంతటి వారైనా ఆమె అందానికి ముగ్ధులై తీరాల్సిందే.. అన్నట్లుగా ఉంది ఈ పిక్‌లో ఈ ముద్దుగుమ్మ స్టైల్. ఈ నెల 24నుండి 'జూలీ - 2' ధియేటర్స్‌లో సందడి చేయనుంది.