'వాల్మీకి' ఓడినా గెలిచినట్లే!

మరిన్ని వార్తలు

సినిమా కోసం కష్టపడి పని చేయడం వేరు. సినిమాని ఇష్టపడి, కష్టపడడం వేరు. అలా ఎంతో ఇష్టపడి వాల్మీకి మహర్షి వంటి మహా ఋషి గొప్పతనాన్ని జనానికి తెలియచేయాలనే సత్సంకల్పంతో 'వాల్మీకి' అనే టైటిల్‌తో సినిమా తెరకెక్కించాను.. కానీ, ఆ అవకాశం నాకు ఇవ్వలేదు. ఆ టైటిల్‌ని ధియేటర్‌లోకి వెళ్లనీయకుండా ఆపేశారు.. ఈ పరిణామం జీవితంలో తనను తొలిసారి ఓడిపోయేలా చేసింది..' అని సినిమా టైటిల్‌ మార్పుపై బాధ పడ్డారు డైరెక్టర్‌ హరీష్‌ శంకర్‌.

 

ఓడిపోవడం అంటే, సినిమా ఫెయిల్యూర్‌ కారణంగానో, డైరెక్టర్‌గానో, రైటర్‌గానో కాదు.. హైందవ సమాజానికి చెందిన ఓ వ్యక్తిగా 'వాల్మీకి' వంటి ఓ గొప్ప వ్యక్తి గౌరవాన్ని, ఆయనకు సంబంధించిన ఓ మంచి విషయాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఓడిపోయానని హరీష్‌ శంకర్‌ తెలిపారు. ఆయన ఎంతో ఇష్టపడి పెట్టుకున్న టైటిల్‌ ఇది. అందుకే ఈ టైటిల్‌పై ఆందోళన చేసిన ప్రతీ ఒక్కరూ ఈ సినిమా చూసి, వాల్మీకికి సంబంధించిన ఏ తప్పు ఈ సినిమాలో లేదని తమంతట తాము అనుకుంటే అదే చాలు.. అని ఆయన కోరుకున్నారు.

 

నిజానికి తమకు రావల్సిన లాభం తమకు వచ్చేసిందనీ, ఈ సినిమా బ్యాన్‌ చేయడంతో టెన్షన్‌ పడుతున్న కొందరు డిస్ట్రిబ్యూటర్లు, ప్రొడ్యూసర్స్‌ కోసమే ఈ సినిమా టైటిల్‌ మార్చుతున్నామని హరీష్‌ చెప్పిన మాటలతో విడుదలకు ముందే అందరి మనసుల్ని గెలిచేశాడు 'వాల్మీకి'గా హరీష్‌ శంకర్‌. ఆ సానుభూతితో సినిమాకి అభిమానులు మరింత మంచి విజయాన్ని కట్టబెడతారనడం అతిశయోక్తి కాదేమో. ఇదిలా ఉంటే, ఈ రోజు ప్రేక్షకుల ముందుకు రానుంది 'గద్దలకొండ గణేష్‌'. ఆల్రెడీ ప్రీమియర్స్‌ నుండి అందుతోన్న రిపోర్ట్స్‌ ప్రకారం 'గద్దలకొండ గణేష్‌' హిట్‌ కొట్టాడనే సమాచారం అందుతోంది. తొలి టాక్‌ పోజిటివ్‌గా రావడంతో మన 'గద్దలకొండ గణేష్‌' ఇక బాక్సాఫీస్‌ని గజగజలాడించుడే మిగిలిందనుకోవాలి. చూడాలి మరి ఆ వణుకు ఎలా ఉండబోతోందో.!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS