రాజుతో 'రాణి' ఇంకోసారి ఫిక్సయ్యిందా?

By Inkmantra - September 20, 2019 - 07:30 AM IST

మరిన్ని వార్తలు

రానాకి కీర్తి సురేష్‌ హ్యాండిచ్చిందట.. అనే వార్త ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అయిపోయింది. నిజంగా కీర్తి కాదన్నదో లేదో కానీ, ఈ న్యూస్‌ అయితే బాగా సర్క్యులేట్‌ అయిపోతోంది. ఇదిలా ఉంటే, ఏ సినిమాకి అయితే, కీర్తిసురేష్‌ హ్యాండిచ్చింది అనుకుంటున్నారో, ఆ సినిమాలో కీర్తి ప్లేస్‌ని కాజల్‌ అగర్వాల్‌ రీప్లేస్‌ చేయనుందన్నది తాజా సమాచారం. ఇంతకీ ఏంటా సినిమా? ఏంటా కథ? అంటే, ఇటీవల 'ఓ బేబీ' సినిమాతో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అందుకున్న నందినీ రెడ్డి మరో కొరియన్‌ మూవీ రీమేక్‌కి సిద్ధమైందట.

 

అదేంటో కొరియన్‌ మూవీస్‌పై పడింది వెళ్లి వెళ్లి నందినీ రెడ్డి. ఓ మాఫియా బ్యాక్‌ గ్రౌండ్‌ నేపథ్యంలో రూపొందిన కొరియన్‌ చిత్రం నందినీ రెడ్డిని బాగా ఆకర్షించిందట. ఈ సినిమాని రానా హీరోగా తెలుగులో రీమేక్‌ చేయాలనుకుంటోందట. ఆ సినిమా కోసమే హీరోయిన్‌గా కీర్తిని సంప్రదించగా, రీజన్‌ ఏదైతేనేం ఆమె కాదనేసరికి, ఆ ప్లేస్‌లో కాజల్‌ పేరు వచ్చి చేరింది. కాజల్‌ కూడా బాగానే ఉంటుందని భావించి నందినీ రెడ్డి అండ్‌ టీమ్‌ ఓకే చేసినట్లు తెలుస్తోంది. కాజల్‌, రానా గతంలో 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాలో నటించారు. ఈ సినిమా రానాకి మంచి సక్సెస్‌నిచ్చింది.

 

సో ఆ సెంటిమెంట్‌ కూడా బాగానే వర్కవుట్‌ అవుతుంది కాబట్టి, అలా చందమామ మరోసారి రానాకి రాణిగా ఫిక్సయ్యిందంటున్నారు. అయితే, ఈ మ్యాచ్‌ ఫిక్సింగ్‌పై ఇంకా అఫీషియల్‌ క్లారిటీ రావాల్సి ఉంది. ఓ వైపు రానా 'విరాటపర్వం', 'హిరణ్యకశ్యప' చిత్రాలతో పాటు, ఓ హిందీ సినిమా, ఓ ఇంగీష్‌ సినిమాలతో బిజీగా ఉన్నాడు. తాజాగా నందినీ రెడ్డి ప్రపోజల్‌తో మరో కొత్త సినిమా ఆయన ఖాతాలో పడిందన్న మాట. అటు కాజల్‌ కూడా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వరుస ప్రాజెక్టులతో బిజీగానే గడుపుతోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS