కాంట్రవర్సీ కి కేరాఫ్ బాలీవుడ్. వివాదాలు ఎక్కడున్నా పట్టి లాగేసి - దాని చుట్టూ సినిమా కథల్ని అల్లుకుంటుంది. ఇప్పుడు బాలీవుడ్ లో ఎక్కడ చూసినా రియా చక్రవర్తి పేరే వినిపిస్తోంది. సుశాంత్ సింగ్ ఆత్మహత్యతో మీడియా దృష్టిని ఆకర్షించింది రియా చక్రవర్తి. అసలు రియా పతానికి కారణం రియానేనని, రియా ఒత్తిడి వల్లే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడంటూ కామెంట్లు వినిపించాయి. డ్రగ్స్ కేసులో రియా ఇప్పుడు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది.
తన చేతిలో... చాలామంది బాలీవుడ్ సెలబ్రెటీ జాతకాలున్నాయని భోగట్టా. రియా వెల్లడించిన పేర్ల ప్రకారమే ఎన్‌సీబీ ఇప్పుడు విచారణ చేస్తోంది. అందుకే ఇప్పుడు బాలీవుడ్ లో రియానే హాట్ టాపిక్. రియా చుట్టూ బాలీవుడ్ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దాంతో బాలీవుడ్ రియాని వాడుకోవాలని ఫిక్సయిపోయింది. రియా జీవిత కథని ఆధారంగా చేసుకుని అక్కడో సినిమా రూపుదిద్దుకోనుందని సమాచారం. అయితే అందుకు రియా అనుమతి ఉందా? లేదా? అనేది మాత్రం తెలియడం లేదు.
మరోవైపు సుశాంత్ సింగ్ పై కూడా బయోపిక్ తయారవుతుంది. అందులోనూ రియా పాత్ర ఉంటుంది. మరి ఈరెండు బయోపిక్‌లలో ఏది ముందు విడుదల అవుతుందో? వీటిలో సంచలనం సృష్టించే సత్తా దేనికి ఉందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాలి.