దాదాపుగా వంద రోజుల విరామం తరవాత థియేటర్లు తెరచుకున్నాయి. ఈ శుక్రవారం ఒకేసారి.. రెండు సినిమాలొచ్చాయి. ఇష్క్, తిమ్మరుసు.. రెండూ తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నాయి. చాలా రోజుల తరవాత.. థియేటర్ల దగ్గర హడావుడి కనిపించింది. అయితే ఈ ముచ్చట ఈ శుక్రవారానికే పరిమితం అయ్యే సూచనలు ఉన్నాయి.
ఎందుకంటే... ఆగస్టు 6 నుంచి.. ఏపీలో థియేటర్లు మూసేస్తున్నారు. అక్కడ థియేటర్ల పరంగా చాలా సమస్యలున్నాయి. టికెట్ రేట్లు బాగా తగ్గించేశారు. ఆ రేట్లని సినిమాల్ని ప్రదర్శించలేరు. పైగా 50 శాతం ఆక్యుపెన్సీ మాత్రమే ఉంది. ఈ శుక్రవారం ఏపీలో చాలా థియేటర్లు మూతబడే ఉన్నాయి. ఏపీసర్కార్ ఈ విషయంపై ఏదో ఓ నిర్ణయం తీసుకునేంత వరకూ మిగిలిన థియేటర్లనీ మూసేస్తార్ట. తెలుగు చిత్రసీమకు ఏపీ, తెలంగాణ రెండు కళ్లు. ఏపీలో ఇలాంటి పరిస్థితి ఉంటే... తెలంగాణలో సినిమాల్ని ఆడించలేరు. కాబట్టి.. ఆగస్టు 6 తరవాత. తెలంగాణ లోనూ థియేటర్లు ఉండకపోవొచ్చు. సో... తెరచుకున్న థియేటర్లు తెరచుకున్నట్టే మూసేస్తున్నారన్నమాట. ఏపీ ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకునేంత వరకూ... ఇదే పరిస్థితి.