తెలంగాణలో సినిమా టిక్కెట్ల ధరలు పెరిగాయి. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో తెలుగు సినీ పరిశ్రమలో పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సినిమా టిక్కెట్ల ధరల పెంపు జరగాల్సి ఉందని ప్రభుత్వం దృష్టికి సినీ ప్రముఖులు తమ డిమాండ్లను తీసుకెళ్ళారు. వాటిని సానుకూలంగా తెలంగాణ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది. భారీ బడ్జెట్‌తో సినిమాలు తెరకెక్కుతున్నందున, టిక్కెట్ల ధరలు పెరగాల్సిన ఆవశ్యకతను సినీ ప్రముఖులు తెలంగాణ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అయితే టిక్కెట్ల ధరల పెరుగుదలతో కొన్ని సమస్యలూ ఉంటాయి. సామాన్యులకు ఎక్కువగా ఈ టిక్కెట్ల పెంపుతో వాత పడే అవకాశాలున్నాయి. మరో పక్క 100 కోట్ల బిజినెస్ లెక్కలు ఇకపై 150 కోట్లకు పైనే మారవచ్చు. సినిమా సక్సెస్ అయితే వసూళ్ళు అదిరిపోతాయి. కానీ ఫలితం తేడా వస్తే మాత్రం థియేటర్లకు వెళ్ళడానికి ప్రేక్షకులు ఇష్టపడకపోవచ్చునని అంటున్నారు. చిన్న సినిమాల నిర్మాతలు ఈ నిర్ణయంతో తాము నష్టపోతామని కూడా చెబుతుండడం జరుగుతోంది. సో వినోద సాధనం అయిన సినిమా ఇంత కాస్ట్ అయిపోవడంతో సినీ ప్రియులు కొంత ఆందోళన చెందుతున్న మాట వాస్తవమే అయినప్పటికీ, మారిన పరిస్థితుల దృష్ట్యా ఈ ఎటాక్ తప్పనిసరి అని గ్రహించాలి.