గత వారం హాలీవుడ్ అవతార్ 2 తప్పితే కొత్త సినిమాల సందడి కనిపించలేదు. అయితే ఈ వారం క్రిస్మస్ సందడి బాక్సాఫీసు వద్ద కనిపించబోతుంది. రెండు తెలుగు సినిమాలు , మరో రెండు డబ్బింగ్ సినిమాలు సందడి చేయబోతున్నాయి. రవితేజ ధమాకా డిసెంబర్ 23న రాబోతుంది. ఇప్పటికే ఆడియో సూపర్ హిట్ అయ్యింది. ట్రైలర్ లో వింటేజ్ రవితేజ కనిపిస్తున్నారు. అలాగే దర్శకుడు త్రినాథ్ నక్కిన కి మాంచి క్లాస్, మాస్ టచ్ వుంది. ఆయనకి సక్సెస్ రేటు ఎక్కువ. ఈ రకంగా ధమాకాపై మంచి అంచనాలనే వున్నాయి.
కార్తికేయ2 పాన్ ఇండియా తర్వాత నిఖిల్ చేస్తున్న సినిమా 18 పేజస్. సుకుమార్ ఈ చిత్రానికి కథ ఇవ్వడం, గీత ఆర్ట్స్ నిర్మించడం, ట్రైలర్ ఆకట్టుకోవడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. సుకుమార్ మార్క్ లవ్ స్టొరీ చూసి చాలా కాలమైయింది. ధమాకాతో పాటే ఈ సినిమా కూడా వస్తుంది. డిసెంబర్ 22కి మరో రెండు డబ్బింగ్ సినిమాలు వస్తున్నాయి. విశాల్ 'లాఠీ 'తో వస్తున్నాడు. యాక్షన్ సినిమాలతో ఆకట్టుకున్న విశాల్ లాఠీ ని పాన్ ఇండియా స్థాయిలో నిర్మించాడు. ట్రైలర్ లో హైవోల్టేజ్ యాక్షన్ కనిపిస్తోంది. కనెక్ట్ అనే హారర్ సినిమాతో వస్తోంది నయనతార. లేడి ఓరియెంటెడ్ సినిమాలు ఆమెకు బాగా కలిసొచ్చాయి. కనెక్ట్ కంటెంట్ పై కూడా చాలా నమ్మకాలు పెట్టుకుంది. మొత్తంమీద ఈ వారం వస్తున్న నాలుగు సినిమాలు ప్రామెసింగ్ అంచనాలు వున్నవే కావడం విశేషం