ఆకట్టుకుంటోన్న‘మిస్టర్ అండ్ మిసెస్’ఫస్ట్ లుక్ పోస్టర్.

మరిన్ని వార్తలు

తెలుగు ప్రేక్షకుల టేస్ట్ లో మార్పులు వచ్చాయి. ఆ మార్పులకు తగ్గట్టుగానే కొత్తగా వస్తోన్న మేకర్స్ సరికొత్త కాన్సెప్ట్స్ తో వస్తున్నారు. అలా ఇప్పుడు మిస్టర్ అండ్ మిసెస్ అంటూ ఓ సినిమా రాబోతోంది. క్రౌడ్ ఫండెడ్ సినిమాగా వస్తోన్న ఈ చిత్రాన్ని అశోక్ రెడ్డి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించబోతున్నాడు. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను ప్రముఖ నిర్మాత మధుర శ్రీధర్ విడుదల చేశారు. పోస్టర్ ఇన్నోవేటివ్ గా ఉందని మెచ్చుకుంటూ ఎంటైర్ టీమ్ కు ఆల్ ది బెస్ట్ చెప్పారు మధుర శ్రీధర్.

 

ఈ సందర్భంగా దర్శక నిర్మాత అశోక్ రెడ్డి మాట్లాడతూ: "ఓ గ్రామీణ ప్రాంతానికి చెందిన యువకుడు, ముంబైకి చెందిన మోడ్రన్ యువతికి పెళ్లవుతుంది. వీరి లో ఒకరి మైబైల్ మిస్ అవుతుంది.. ఆ మొబైల్ లో ఏముంది.. మిస్ అయిన మొబైల్ వీరి జీవితాలలో ఎలాంటి మార్పులను తెచ్చింది..? యూత్ రిలేట్ అయ్యే కంటెంట్ తో ఈ సినిమా కథనం సాగుతుంది" అన్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS