అడవి శేష్ చాలా రోజులుగా తెరపై కనిపించలేదు. చాలా గ్యాప్ తర్వాత ఇపుడు డెకాయిట్, గూఢచారి 2 అనే రెండు సినిమాలు చేస్తున్నాడు. గూఢచారి 2 లో బాలీవుడ్ హీరోయిన్ బనితా సంధు హీరోయిన్ గా ఫిక్స్ అయ్యింది. కొంత పార్ట్ షూటింగ్ కూడా జరిగింది. కానీ అంతలోనే బనిత ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. నెక్స్ట్ డెకాయిట్ లో శృతి హాసన్ హీరోయిన్ గా ఫిక్స్ అవటం కొంత పార్ట్ షూటింగ్ జరగటం తెలిసిందే. కానీ శృతి కూడా డెకాయిట్ నుంచి తప్పుకుంది. ఈ కారణాలతోనే శేషు సినిమాలు రెండు లేట్ అయ్యాయి. తాజాగా డెకాయిట్ కి హీరోయిన్ దొరికింది.
హీరోయిన్ లేకుండా డెకాయిట్ షూట్ స్టార్ట్ చేసి గ్లిమ్ప్స్ రిలీజ్ చేసారు. తాజాగా హీరోయిన్ ఎవరన్నది రివీల్ చేసారు మేకర్స్. షనీల్ డియో దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్నారు. సోమవారం హీరోయిన్ ఫేస్ ను రివీల్ చేయకుండా, కళ్ళు రివీల్ చేసి ఆమె ఎవరో చెప్పుకోండి చూద్దాం అంటూ ఛాలెంజ్ చేసారు. అడవి శేష్ బర్తడే సందర్భంగా మంగళవారం ఉదయం 11 గంటల 30 నిమిషాలకు 'డెకాయిట్' లో హీరోయిన్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ప్రేక్షకులు పసిగట్టినట్టే ఆమె మరెవరో కాదు మృణాల్ ఠాకూర్.
డెకాయిట్ లో మృణాల్ డీ గ్లామర్ రోల్ లో కనిపిస్తుందని సమాచారం. తెలుగులో 'ది ఫ్యామిలీ స్టార్' సినిమా తరవాత మృణాల్ చేస్తున్న సినిమా ఇదే. ఫస్ట్ లుక్ పోస్టర్ చూసాక మృణాల్. అడవి శేషు జోడీ బాగుంది అని కామెంట్స్ వస్తున్నాయి. అనవసరంగా శృతి మంచి ఛాన్స్ మిస్ చేసుకుంది అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి శేషుకి హీరోయిన్ దొరికింది. ఇక గూఢచారి 2 లో ఎవరు హీరోయిన్ అన్నది చూడాలి.