ఎం.ఎస్.రాజు నుంచి వచ్చిన మరో సినిమా `డర్టీ హరీ.` ఈ సినిమా ట్రైలర్లు, టీజర్లూ, పోస్టర్లూ చూసి జనాలు గగ్గోలు పెట్టారు. రాజు గారు మరీ దిగజారిపోయి ఈ సినిమా తీశారా? అంటూ ముక్కున వేలేసుకున్నారు. కానీ ఆయన మాత్రం..`నేను మంచి సినిమానే తీశా. చూశాక చెప్పండి` అంటూ జవాబు చెప్పారు. ఆయన అన్నట్టుగానే.. `డర్టీ హరీ` అందరినీ ఆశ్చర్యపరిచింది. కొన్ని బోల్డ్సన్నివేశాలున్నప్పటికీ, రాజు అడ్వాన్స్డ్గా ఆలోచించి ఈ సినిమా తీశారని కితాబులు ఇచ్చారు. ఈ వయసులో ఆయన ఇలాంటి సినిమా తీయడం గ్రేట్ అన్నారు. అయితే ఆ సినిమా ఏటీటీకి పరిమితమైంది. ఇప్పుడు ఆహాలో ఉంది.
ఇప్పుడు ఈ సినిమాని థియేటర్లలోనూ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. జనవరి 8న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి రెడీ అయ్యారు. నిజానికి జనవరి 1నే విడుదల చేద్దామనుకున్నారు. కానీ కుదర్లేదు. జనవరి రెండో వారంలో సంక్రాంతి సినిమాల హంగామా మొదలైపోతుంది. అందుకే అంతకంటే ముందే ఈ సినిమా విడుదల చేస్తున్నారు. ఓటీటీ, ఓటీటీల్లో జనాదరణ పొందిన ఈ చిత్రం.. థియేటర్లలో ఏమాత్రం మెప్పిస్తుందో చూడాలి.