కలర్ ఫోటో సినిమాతో ఆకట్టుకున్న దర్శకుడు సందీప్ రాజ్. ఇప్పుడు ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ముఖచిత్రం’. విశ్వక్‌సేన్ లాయర్‌గా అతిథి పాత్రలో కనిపించడం స్పెషల్ ఎట్రాక్షన్. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ట్రై యాంగిల్ లవ్‌స్టోరీ అంటూ మొదలైన ఈ ట్రైలర్ లో చాలా మలుపులు వున్నాయి.
ఒక అమ్మాయి ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ చేసి మరో అమ్మాయిలా మారిస్తే.. ఏం జరుగుతుందని కథాంశం. క్రైమ్ డ్రామా అంశాలతో ఆసక్తిరేపుతోంది ఈ ట్రైలర్. చివర్లో ఇది స్పోర్ట్స్ డ్రామా అనే డైలాగ్ చెప్పడం కూడా ఆసక్తికంగా వుంది. డిసెంబర్ 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.