సింగిల్ ది¸యేటర్ల మాటెలా వున్నా, మల్టీప్లెక్స్‌లకు త్వరలో గ్రీన్ సిగ్నల్ లభించబోతోందంటూ ప్రచారం జరుగుతోంది. గత కొంతకాలంగా దేశంలో మల్టీప్లెక్స్‌ల ట్రెండ్ నడుస్తోంది. సింగిల్ ది¸యేటర్స్ హవా కోల్పోతున్నాయి. మల్టీప్లెక్స్ అంటే ఒక్క సినిమా మాత్రమే కాదు, అక్కడ చాలా వ్యవహారాలుంటాయి. వెరసి అదో పెద్ద షాపింగ్ మాల్ వ్యవహారం. కరోనా వైరస్ నేపథ్యంలో లాక్‌డౌన్ కారణంగా మల్టీప్లెక్స్‌లు దారుణంగా దెబ్బతినే పరిస్థితి వచ్చింది. అయితే, మల్టీప్లెక్స్ యాజమాన్యాలు, కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నాయనీ, జూన్‌లో ఎట్టి పరిస్థితుల్లోనూ మల్టీప్లెక్స్‌లు తెరుచుకుంటాయనీ అంటున్నారు.
ఈ మల్టీప్లెక్స్ ఛెయిన్‌లో మన సినీ ప్రముఖులూ చాలామందికి భాగం వుంది. సూపర్ స్టార్ మహేష్‌బాబు ‘ఎఎంబి’ ది¸యేటర్స్‌ని నిర్వహిస్తోన్న విషయం విదితమే. మల్టీప్లెక్స్‌ల్లో సీటింగ్ ఎరేంజ్‌మెంట్స్ మార్చడం, ప్రేక్షకుల మధ్య ఫిజికల్ డిస్టెన్స్ మెయిన్‌టెయిన్ చేయడం తేలికే. అదే సమయంలో, అక్కడ టిక్కెట్ల ధరలూ ఎక్కువే గనుక, బాగానే వర్కవుట్ కావొచ్చు. ఇలాంటి చాలా అంశాలతో కేంద్రానికి మల్టీప్లెక్స్‌ల యాజమాన్యాలు ఓ నివేదిక ఇప్పటికే ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, కేవలం మల్టీప్లెక్స్‌లకు మాత్రమే అనుమతిస్తే మంచిది కాదనీ, మొత్తంగా సినిమా ది¸యేటర్లన్నిటికీ అవకాశమివ్వాలనే డిమాండ్ వస్తోంది. ఇప్పటికే కొన్ని ది¸యేటర్లు ట్రయల్ రన్‌కి కూడా సిద్ధమవుతున్నట్లు సమాచారం.