ఎన్టీఆర్‌ బయోపిక్‌లో మురళీశర్మ

By iQlikMovies - July 10, 2018 - 12:23 PM IST

మరిన్ని వార్తలు

అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోన్న చిత్రం 'ఎన్టీఆర్‌' బయోపిక్‌. ఎన్టీఆర్‌ జీవిత గాధ అంటే అలనాటి మేటి నటులకు సంబంధించిన ఎన్నో పాత్రలుంటాయి. ఎన్టీఆర్‌ అంటే కేవలం సినీ నటుడు మాత్రమే కాదు, ఓ గొప్ప రాజకీయ నాయకుడు కూడా. 

అందుకే ఇటు రాజకీయాల్లోనూ, అటు సినిమాలకు సంబంధించి, ఆయనకు అత్యంత సన్నిహితమైన ప్రముఖ పాత్రలను తెరపై ఆవిష్కరించాల్సి ఉంటుంది. అందుకే చాలా మంది తారాగణాన్ని ఈ సినిమా కోసం ఎంచుకుంటున్నారు. క్రిష్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ఎన్టీఆర్‌ పాత్రను ఆయన కుమారుడు బాలయ్య పోషిస్తున్నాడు. ఎన్టీఆర్‌ భార్య బసవతారకం పాత్రలో బాలీవుడ్‌ నటి విద్యాబాలన్‌ నటించనుంది. 

తాజాగా ఈ విషయాన్ని చిత్ర యూనిట్‌ ప్రకటించింది. మిగిలిన పలు పాత్రల కోసం యంగ్‌ హీరోస్‌ నాగచైతన్య, రానా తదితరులను ఎంచుకున్నారు. సీనియర్‌ నటులు మోహన్‌బాబు ఓ కీలక పాత్ర పోషించనున్నాడు. రాజశేఖర్‌ పేరు కూడా పరిశీలనలో ఉంది. సూపర్‌స్టార్‌ కృష్ణ పాత్రలో మహేష్‌బాబు నటించనున్నారనీ తెలుస్తోంది. 

ఇదిలా ఉంటే, తాజాగా ప్రముఖ నటుడు మురళీశర్మ ఈ సినిమాలో తాను కూడా భాగం కానున్నానని తెలిపారు. అలనాటి ప్రముఖ రైటర్‌ కమ్‌ డైరెక్టర్‌ అయిన ఆళూరి చక్రపాణి పాత్ర కోసం మురళీశర్మను ఎంచుకున్నారట. సోమవారం నుండీ ఈయన షూటింగ్‌లో పాల్గొన్నారు. ఈ సినిమాతో బాలయ్య తొలిసారి నిర్మాతగా మారుతున్న సంగతి తెలిసిందే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS