సూపర్ స్టార్ మహేష్ తాజా చిత్రం స్పైడర్ గురించిన విశేషాలని దర్శకుడు మురుగదాస్ మీడియాతో పంచుకున్నాడు.
మీరు ప్రతి సినిమాలో ఏదో ఒక సోషల్ మెసేజ్ ఇవ్వడానికి చూస్తుంటారు కదా అని ప్రశ్నించగా- మెసేజ్ కన్నా కథ ముఖ్యం అని నేను నమ్ముతున్నాను. అలాగే కథలో కూడా మెసేజ్ ని అనవసరంగా జొప్పించే ప్రయత్నం చేసినా ఆ కథ తేలిపోతుంది అని చెప్పుకొచ్చాడు.
ఇక మహేష్ తో పనిచేయడం ఎలా ఉందని అడగగా- మహేష్, నేను తమిళంలోనే మాట్లాడుకుంటాం. తనకి తమిళం బాగా రావడం అలాగే తను హీరో అయ్యేవరకు చెన్నైలోనే ఉండడంతో ఈ చిత్రానికి బాగా ప్లస్ అయింది. ఈ షూటింగ్ సమయంలో చెన్నై మొత్తం తిప్పుతూ తనకి తెలిసిన, నచ్చిన ప్రదేశాలు చూపించాడు. మా ఇద్దరి మధ్యలో ‘చెన్నై’ అనే విషయం కామన్ పాయింట్.
స్పైడర్ చిత్రం తరువాత విజయ్ హీరోగా ఒక చిత్రం తెరకెక్కించే ప్రయత్నంలో ఉన్నానని తెలిపాడు