నిన్న ప్రకటించిన జాతీయ చలనచిత్ర అవార్డుల పై తన నిరసన తెలియచేశాడు డైరెక్టర్ మురుగదాస్.
వివరాల్లోకి వెళితే, అవార్డుల ఎంపికలో జ్యూరీ లో ఉన్న సభ్యులు పక్షపాతంగా వ్యవహరించారని, తమకు తెలిసినవారికే అవార్డులు ఇచ్చారని మురుగదాస్ దుయ్యబట్టాడు. తనకు కలిగిన ఆవేదనని తన ట్విట్టర్ ద్వారా అందరితో పంచుకున్నాడు.
ఇక ఈ ఆరోపణల విషయానికి వస్తే, జ్యూరీ అధ్యక్షుడైన డైరెక్టర్ ప్రియదర్శన్ అవార్డుల ప్రధానోత్సవంలో తన స్వంత రాష్ట్రమైన నుండి వచ్చే మలయాళ సినిమాలకు ఎక్కువ అవార్డులు దక్కేలా చూశాడని ఈ ఎంపిక నచ్చనివారు చేస్తున్న ప్రచారం.
అయితే ఎప్పుడు అవార్డుల ప్రకటన జరిగినా ఇలాంటి అసంతృప్తులు సహజమేనని కొందరు నిట్టుర్పు విడుస్తున్నారు.