కిటికీల జాకెట్లు ఒకప్పుడు ట్రెండ్. కానీ ఇప్పుడు ఆ కిటికీలు బికినీలకు పాకేశాయి. బికినీ అంటేనే సింగిల్ పీస్, టూ పీస్..ఇదే మనకింత వరకూ తెలిసింది. కానీ ఇప్పుడు పీస్ పీస్ బికినీలొచ్చేశాయి. అవేనండీ కిటికీల బికినీలన్నమాట. ఇప్పుడివే ట్రెండింగ్. ముక్కలు ముక్కలుగా అతుకులేసి డిజైన్ చేస్తున్న ఈ బికినీలకు ముద్దుగుమ్మల్లో తెగ క్రేజ్ వచ్చేసింది. ఒకరి తర్వాత ఒకరు ఈ కిటికీల బికినీలేసుకొని సోషల్ మీడియాలో తమ హాట్ హాట్ సొగసులతో హీటెక్కించేస్తున్నారు.
తాజాగా 'పైసా వసూల్' బ్యూటీ ముస్కాన్ సేథి ఈ బికినీలో వయ్యారంగా ఫోటో సెషన్ చేయించుకుంది. వైట్ అండ్ బ్లాక్ ఫోర్ పీస్ బికినీలో ఈత కొలను పక్కన కూర్చొని దిగిన ఈ ఫోటోకి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. తొలి సినిమాకే బాలయ్య వంటి స్టార్ హీరో పక్కన నటించినా ఈ ముద్దుగుమ్మకి మరో ఛాన్స్ రాలేదు. దాంతో అప్పుడప్పుడూ ఇలా హాట్ పిక్స్‌కి పోజిస్తూ, నెట్టింట్లో ఫాలోవర్స్‌ని పెంచుకునే ప్రయత్నం చేస్తుంటుంది అందాల ముస్కాన్ సేథి.
ALSO SEE : Musskan Sethi Latest Photo Gallery