బాల‌య్య వ‌ద్ద‌న్నాడు... వెంకీ ర‌మ్మ‌న్నాడా..?

మరిన్ని వార్తలు

అగ్ర ద‌ర్శ‌కుడిగా చ‌లామ‌ణి అయిన వి.వి.వినాయ‌క్ ప‌రిస్థితేం బాలేదు. స్టార్ హీరోలంతా.. 'విజ‌యం' చుట్టూనే తిరుగుతున్నారు. కొత్త కాన్సెప్టు క‌థ‌ల కోసం వెదుకుతున్నారు. క‌మ‌ర్షియ‌ల్ ఫార్ములానే న‌మ్ముకున్న వినాయ‌క్ వాళ్ల కంటికి క‌నిపించ‌డం లేదు.  పైగా 'ఇంటిలిజెంట్‌' ఫ‌లితం ఆయ‌న్ని పూర్తిగా బ్యాక్ స్టెప్ వేసేలా చేసింది. 

 

అప్పుడెప్పుడో నంద‌మూరి బాల‌కృష్ణ‌తో సినిమా అనేది వార్త‌ల్లోకి వ‌చ్చింది. సి.క‌ల్యాణ్ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తార‌ని ప్ర‌చారం జ‌రిగింది. అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ ఆ సినిమాకి సంబంధించిన విష‌య‌మేదీ బ‌య‌ట‌కు రాలేదు. బాల‌య్య కూడా వ‌రుస సినిమాల‌తో బిజీ అవుతూ... వినాయ‌క్ ని ప‌క్క‌న పెట్టేశాడు. దాంతో మ‌రో హీరోని వెదుక్కోక త‌ప్ప‌డం లేదు వినాయ‌క్‌కి. 

 

ఇప్పుడు వినాయ‌క్ దృష్టి వెంక‌టేష్‌పై ప‌డిన‌ట్టు స‌మాచారం. వెంక‌టేష్ - వినాయ‌క్‌ల కాంబినేష‌న్‌లో 'లక్ష్మీ' వ‌చ్చింది. ఆసినిమా మంచి విజ‌యం సాధించింది. ఆ త‌ర‌వాత వీరిద్ద‌రూ మ‌ళ్లీ జ‌త క‌ట్ట‌లేదు. ఇప్పుడు వెంకీతో సినిమా చేయ‌డానికి వినాయ‌క్ రెడీ అవుతున్న‌ట్టు టాక్‌. వెంక‌టేష్ కూడా బాల‌య్య‌లా తిప్పించుకుంటాడా, లేదంటే.. ఇది వ‌ర‌కు 'లక్ష్మీ' తో ఓ మంచి హిట్ ఇచ్చాడు క‌దా అని ఈ సినిమాని వెంట‌నే ప‌ట్టాలెక్కిస్తాడో....చూడాలి మ‌రి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS