గ్లామ్‌షాట్‌: అందంగా మురిపిస్తున్న ముస్కాన్‌.!

By Inkmantra - November 01, 2019 - 17:30 PM IST

మరిన్ని వార్తలు

అందాల భామ ముస్కాన్‌ సేథికి కాలం కలిసి రావడం లేదు. 'రాగల 24 గంటల్లో' అంటూ ఓ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ మూవీతో రాబోతోంది. నవంబర్‌ 15న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈషా రెబ్బ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమాలో అందాల ముస్కాన్‌ సేథి కీలక పాత్ర పోషించింది. బాలయ్యతో 'పైసా వసూల్‌' అంటూ డెబ్యూ చేసిన ఈ భామకు హీరోయిన్‌గా అన్ని అర్హతలున్నప్పటికీ, అవకాశాలు మాత్రం దరి చేరడం లేదు. ఎట్టకేలకు పట్టిన ఈ అవకాశమైనా కలిసి రావాలని ఆశిద్దాం. ఇకపోతే, ఎలాగూ డెబ్యూ చేసింది కదా.. అప్పటి నుండీ తనవంతు ప్రయత్నంగా నెట్టింట్లో ఏవో తంటాలు పడుతోంది.

 

హాట్‌ హాట్‌ పిక్స్‌తో రెచ్చిపోయి కుర్రకారుకు గాలమేస్తుంటుంది. అఫ్‌కోర్స్‌ దర్శక, నిర్మాతలకు కూడా. అయితే, పాప గాలంలో పడేదెంతమంది.? కానీ, కుర్రకారుకు మాత్రం ముస్కాన్‌ తెగ నచ్చేస్తుంటుంది. తాజాగా ముస్కాన్‌ ఓ పిక్‌ పోస్ట్‌ చేసింది. పెద్దగా స్కిన్‌ షో ఆశించే వారికిది అంతగా సంతృప్తినివ్వదు కానీ, అందాన్ని ఆరాధించే కళాపోషకులకు మాత్రం పైసా వసూల్‌. మీరే చూడండి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS