రామ్‌గోపాల్ వర్మ - నాగార్జున కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న 'ఆఫీసర్' సినిమా కోసం వర్మ, మిరా సరీన్ అనే కొత్త భామని తీసుకొచ్చాడు. ఈ ముద్దుగుమ్మకి 'ఆఫీసర్' తొలి సినిమానే అయినా కానీ, తన టాలెంట్‌తో ఈ ముద్దుగుమ్మ వర్మని బీభత్సంగా ఇంప్రెస్ చేసేస్తోందట. అసలు ఆమె టాలెంట్‌కి చిత్ర యూనిట్ అంతా అవాక్కవుతున్నారట.
ఎంతో సీనియర్ అయిన నాగార్జునే మిరా సరీన్ నటనకు షాక్ తిన్నారట. ఇటీవలే ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది. తొలి సినిమా అయినా కానీ ఎన్నో సినిమాల్లో నటించిన అనుభవం ప్రదర్శిస్తోన్న మిరా సరీన్‌ను చూస్తుంటే, వర్మకి ఓ చిలిపి ఐడియా వచ్చేసిందట. అదేంటంటే, వర్మ త్వరలో తెరకెక్కించబోయే 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రానికి హీరోయిన్‌గా మిరా సరీన్‌ని ఎంచుకుందామనే ఆలోచనలో ఉన్నాడనీ విశ్వసనీయ వర్గాల సమాచారమ్.
అయితే లక్ష్మీపార్వతి క్యారెక్టర్‌లో నటించి మెప్పించగల సత్తా ఈ ముద్దుగుమ్మలో ఉందా? అంటే ఏమో 'ఆఫీసర్' సినిమా విడుదలైతే కానీ ఆడియన్స్‌కి తెలీదు. ఆడియన్స్ సంగతి ఎలా ఉన్నా, వర్మ మాత్రం ఇంప్రెస్ అయిపోయాడట. అయినా వర్మనే ఇంప్రెస్ చేసిందంటే ఈ ముద్దుగుమ్మ ఏమంత ఆషా మాషీ కాదనిపిస్తోంది. బయోపిక్స్ విషయంలో కాస్టింగ్‌ని ఎంచుకోవడంలో వర్మకి సాటి ఎవరూ లేరని చెప్పాలి.
బయోపిక్స్‌కి వర్మ ఎంచుకునే ఆర్టిస్టులు అచ్చుగుద్దినట్లుగా ఒరిజినల్ క్యారెక్టర్స్‌ని తలపించేలా ఉంటాయనడంలో అతిశయోక్తి కాదు. ఏమో ఒకవేళ మిరా సరీన్‌లో వర్మకి లక్ష్మీపార్వతి కళ కనిపించిందేమో చూడాలి మరి.