మైత్రీ మూవీస్ బ్యానర్ సంస్థ పవన్ కళ్యాణ్‌తో సినిమా చేస్తే ఆయనకి 45 కోట్లు ఇస్తామని అప్పట్లో ఆఫర్ చేశారు 'అజ్ఞాతవాసి' టైంలో. అయితే ఆ సినిమా విడుదలకు ముందు పవన్ కళ్యాణ్‌పై ఉన్న అంచనాలతో ఆ సంస్థ వారు అలా అని ఉంటారు అనుకున్నారు.
కానీ 'అజ్ఞాతవాసి' ఫ్లాప్ తర్వాత కూడా ఆదే ఆఫర్‌తో పవన్‌తో సినిమా చేయడానికి మైత్రీ మూవీస్ సంస్థ వెంటపడింది. అయినా పవన్ ఓకే చెప్పలేదు. సరికదా, ఆ తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేశాడు పవన్. దాంతో ఇదంతా ఓ గాసిప్‌లాగే ప్రచారంలోకొచ్చింది. అయితే టాలీవుడ్‌లో పవన్ కళ్యాణ్ రేంజ్ ఇంత.! అని ఈ విషయంపై ప్రముఖ నటుడు, నిర్మాత, రచయిత అయిన పోసాని కృష్ణ మురళి తాజాగా క్లారిటీ ఇచ్చాడు.
'పవన్ కళ్యాణ్ డేట్స్ దొరికితే, 40 కోట్లు ఇవ్వడానికి నేను రెడీ.. నువ్వు డేట్స్ తెస్తావా అని ఓ ఇంటర్వ్యూలో పోసాని జర్నలిస్టును అడిగారు. అంతేకాదు పవన్ ఒప్పుకుంటే, అప్పు చేసి మరీ ఆయనకి 45 కోట్లు ఇచ్చి సినిమా తీస్తానని సవాల్ చేశారు పోసాని కృష్ణ మురళి. అదీ పవన్ కళ్యాణ్ రేంజ్. చిరంజీవి అన్నా ఇదే క్రేజ్. కానీ రాజకీయాల్లోకి వెళ్లి అన్నయ్య సినిమా కెరీర్‌ని పాడు చేసుకున్నాడు. దాదాపు తొమ్మిదేళ్లు సినిమాకి దూరమయ్యాడు అన్నయ్య చిరంజీవి. ఇప్పుడు తమ్ముడు పవన్ కళ్యాణ్ కూడా అదే బాటలో నడుస్తున్నాడు. రాజకీయాల్లోకి అడుగుపెట్టి, సినిమాల్లో నటించడేమో ఇక అనే అనుమానం కలిగేలా ప్రవర్తిస్తున్నాడు. అలా అయితే సినిమా కెరీర్ దెబ్బ తిన్నట్లే.
ఇప్పటికీ, ఎప్పటికీ మైత్రీ మూవీస్, పోసాని కృష్ణ మురళి తదితర ప్రముఖులు కొంతమంది పవన్ కోసం ఇలాంటి ఆఫర్స్ ఇస్తూనే ఉంటారు. మరి పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడో చూడాలి.