అతిలోక సుందరి శ్రీదేవి ఫిబ్రవరి 24న దుబాయ్‌లో ఓ వివాహానికి హాజరై తాను నివాసం ఉంటున్న హోటల్‌లో అనుమానాస్పదంగా మృతి చెందిన సంగతి తెలిసిందే. దురదృష్టవశాత్తూ బాత్ టబ్‌లో మునిగి శ్రీదేవి మరణించిందనీ దుబాయ్ ఫోరెన్సిక్ నివేదిక వెల్లడించింది. అయితే ఆమె మరణాన్ని అంత ఆషామాషీగా కొట్టి పారేయడానికి లేదు.
తాజాగా ఓ పోలీస్ ఉన్నతాధికారి చేసిన వ్యాఖ్యలతో మళ్లీ శ్రీదేవి మరణం కలకలంగా మారింది. గల్ఫ్ దేశాల్లో ఆమె కోసం చేసిన ఇన్సూరెన్స్ చాలా పెద్ద మొత్తంలో ఉందట. అందుకోసమే శ్రీదేవిని బలవంతంగా చంపేశారనే ఓ వార్త వెలుగులోకి వచ్చింది. ఇది కాక కపూర్ కుటుంబంలో ఆధిపత్య పోరు, జాన్వీ సినీ తెరంగేట్రంపై కమ్ముకున్న నీలిమేఘాలు తదితర అంశాలు ఆమె మరణానికి కారణాలు కావచ్చని ఆ నోటా ఈ నోటా వినిపిస్తున్న మాట.
అయితే ఓ పాపులర్ నటి మృతి పట్ల ప్రభుత్వం కట్టుదిట్టమైన విచారణ చర్యలు చేపట్టకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆమెది సహజ మరణం కాదనీ, పలువురు అభిమానులు ఆమె మృతి పట్ల కోర్టులో ఫిటీషన్లు దాఖలు చేయగా, ఈ విషయంలో మేమేం కలగచేసుకోలేమని ఉన్నత న్యాయస్థానం కూడా చేతులెత్తేయడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది.
శ్రీదేవికి కోట్లాది మంది అభిమానులున్నారు. వారందరిదీ ఒకటే అనుమానం. ఫిట్‌గా ఆరోగ్యంగా ఉండే శ్రీదేవి ఇంత సులువుగా ఎలా చనిపోతుంది? అనే వారి అనుమానాలకు ఖచ్చితంగా నివృత్తి కలగాల్సిందే.