నందమూరి కళ్యాణ్ రామ్ తాజా చిత్రం నా నువ్వే తొలి ఆట నుండే ఫ్లాప్ టాక్ సొంతం చేసుకున్నది. అయితే తొలి షో కే ఫ్లాప్ టాక్ రావడంతో ఆ ప్రభావం ఈ సినిమా కలెక్షన్స్ పైన తీవ్ర ప్రభావం పడింది.
ఆ ప్రభావం ఎంతా అని అంటే- తొలి నాలుగు రోజుల్లో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ 1కోటి రూపాయల (షేర్) మేర చేసింది. పాపులారిటీ ఉన్న హీరోల ఎవ్వరికి కూడా మరి ఇంత తక్కువ స్థాయిలో కలెక్షన్స్ రావడం జరగదు కాని నా నువ్వే చిత్రానికి మాత్రం ఇందుకు మినహాయింపుగా మిగిలిపోయింది.
ఈ సినిమాకి విడుదల ముందు మంచి టాక్ వచ్చింది, కళ్యాణ్ రామ్ లవర్ బాయ్ లుక్ కి సంబంధించి అందరూ పాజిటివ్ గానే స్పందించారు. అయితే ఈ సినిమా ఫ్లాప్ అవ్వడానికి ముఖ్య కారణం కథ లో బలం లేకపోవడం, దానితో పాటుగా సినిమా ఆద్యంతం కూడా ప్రేక్షకుల సహానానికి పరీక్ష పెట్టే విధంగా ఉండడం కూడా మరో కారణం.
మొత్తానికి కళ్యాణ్ రామ్ కెరీర్ లో ఇదొక భారీ ఫ్లాప్ గా నిలిచిపోయింది.