బుల్లితెరపై 'నాగిని' సీరియల్‌తో పాపులర్ అయిన బ్యూటీ మౌనీరాయ్. ప్రస్తుతం బాలీవుడ్లో బిజీగా గడుపుతోంది. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ఖాన్ ఛాన్సివ్వడంతో బుల్లితెర నుండి పెద్ద తెరకు ప్రమోట్ అయ్యింది. తర్వాత అక్షయ్ కుమార్‌తో ఓ సినిమాలో నటించింది. ఇటీవల తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సంచలన విజయం సాధించిన కన్నడ మూవీ 'కెజిఫ్'లో స్పెషల్ సాంగ్‌లో నటించి సౌత్ ఎంట్రీ కూడా షురూ చేసింది. మరో సౌత్ సినిమాలో హీరోయిన్గా ఛాన్స్ కొట్టేసిందనీ సమాచారమ్.
అయితే అది తెలుగు సినిమానా.? మరే ఇతర భాషా సినిమానా.? అనేది తెలియాల్సి ఉంది. బిగ్ స్క్రీన్‌పై ఆఫర్లు వెల్లువెత్తుతుండడంతో దాదాపుగా బుల్లితెరకు గుడ్‌బై చెప్పేసిందట హాట్ బ్యూటీ మౌనీరాయ్. ఇక బిగ్స్క్రీన్పై పాగా వేశాక, సోషల్ మీడియాలో బాగా యాక్టివ్‌గా ఉంటోంది. ఎప్పటికప్పుడే హాట్ హాట్ పిక్స్‌తో కుర్రకారును పిచ్చెక్కిస్తోంది. తాజా పిక్ విషయానికి వస్తే, లేత ఆకుపచ్చ రంగు దుస్తుల్లో పొంగుకొస్తున్న ఎద అందాలను ఆవగా చూపిస్తూ నిషా నిషాగా మత్తెక్కిస్తోంది అందాల మౌనీరాయ్.