లేటెస్ట్‌గా 'జెర్సీ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ముద్దుగుమ్మ శ్రద్ధా శ్రీనాధ్. వస్తూ, వస్తూనే సమ్‌థింగ్ స్పెషల్ అనిపించుకుంది. పబ్లిసిటీకి ఫస్ట్ ప్రయారిటీ అయిన కాంట్రవర్సీని వెంట తెచ్చుకుంది. తొలి చిత్రానికే పెద్దల పట్ల గౌరవం కాస్త తక్కువ, ఓవర్ కాన్ఫిడెన్స్ కూసింత ఎక్కువ అనిపించుకుంది. ఇప్పుడయితే ఇంకో ప్రశ్నకు తెలివిగా సమాధానం చెప్పి మరింత తెలివైన భామ అనిపించుకుంది.
మాతృభాష కన్నడ అయినా తెలుగులో 'జెర్సీ'తో మంచి పేరు దక్కించుకున్న కారణంగా ఏ సినీ పరిశ్రమ అంటే ఎక్కువ ఇష్టం.? అనే ప్రశ్నకు నిఖార్సయిన సమాధానమిచ్చి ఎస్కేప్ అయ్యింది. అన్ని చిత్రసీమలూ ఇష్టమే. ఏదో ఒక్క చిత్రసీమ మాత్రమే ఇష్టమని చెబితే మిగిలిన చోట అభిమానుల్ని కోల్పోతాను అని క్లారిటీ కూడా ఇచ్చేసింది.
అంటే నటిగా ఎంత పక్కా ప్లాన్‌గా తెరంగేట్రం చేసిందో ఈ భామ అర్ధం చేసుకోవచ్చు. ఏదో అందాల ఆరబోతతోనో, యాక్టింగ్ టాలెంట్‌తోనో పాపులర్ అయిన ముద్దుగుమ్మల్ని ఇంతవరకూ చూసేశాం. కానీ శ్రద్ధా రూటే సెపరేటులా ఉంది. నా దారి రహదారి కాదంటూ, తొలి సినిమాకే సరికొత్త దారిలో స్ట్రేటజీ చూపిస్తోంది. ఈ భామ తీరు విరివిగా ఆఫర్లకు తలుపులు తెరిచేనా.? లేక ఓవర్ కాన్ఫిడెన్స్‌తో సింగిల్ ఆఫర్‌తోనే తొక్కివేయబడునా.? అనేది తెలియాలంటే లెట్స్ వెయిట్ అండ్ సీ.!