ఫ్లాప్ హీరోతో సినిమా ఏంట‌ని.. వేళాకోళం చేస్తే...

మరిన్ని వార్తలు

హిట్టుకొచ్చే మైలేజీ వేరు. ఆ కిక్ వేరు. ప‌డిన క‌ష్టానికి రెట్టింపు ఫ‌లితం వ‌స్తుంది. ఒక్కోసారి ఎంత క‌ష్ట‌ప‌డినా హిట్టు ద‌క్క‌దు. ఒక్కోసారి ఆడుతూ పాడుతూ స‌క్సెస్‌లు కొట్టొచ్చు. ఎలా వ‌చ్చినా హిట్టు హిట్టే. అయితే... అల్ల‌రి న‌రేష్ మాత్రం హిట్టు కోసం దాదాపు 8 ఏళ్లు ఎదురు చూశాడు. ప్ర‌తీసారీ ఫ్లాపే. న‌రేష్ ట్రాక్ త‌ప్పాడ‌న్న‌ది స్ప‌ష్టంగా తెలుస్తూ వ‌చ్చింది. ఇక న‌రేష్ ప‌నైపోయింది అనుకుంటున్న త‌రుణంలో `నాంది` వ‌చ్చింది.

 

శుక్ర‌వారం విడుద‌లైన ఈ చిత్రానికి మంచి స్పంద‌న వ‌స్తోంది. విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు ద‌క్కాయి. సినీ ఇండ్ర‌స్ట్రీ కూడా.. `నాందితో న‌రేష్ మ‌ళ్లీ కొత్త‌గా పుట్టాడు` అంటున్నారు. నాంది హిట్టుతో న‌రేష్ లో కొత్త ఉత్సాహం వ‌చ్చింది. స‌క్సెస్ మీట్లో `ఎనిమిదేళ్ల త‌ర‌వాత వ‌చ్చిన విజ‌యం ఇది` అంటూ న‌రేష్ క‌న్నీళ్లు పెట్టుకున్నాడంటే.. తాను హిట్టు కోసం ఎంత ప‌రిత‌ప‌రించిపోయాడో అర్థం చేసుకోవొచ్చు. ఈ సినిమా చేస్తున్న‌ప్పుడు `ఫ్లాపు హీరోతో సినిమా ఏంట‌ని` చాలామంది ద‌ర్శ‌క నిర్మాత‌ల్ని వేళాకోళం చేశార్ట‌. ఈ విష‌యాన్ని న‌రేష్ స్వ‌యంగా చెప్పాడు. ``2012 తర్వాత హిట్స్ పలకరించడం మానేశాయి. ఈసారి మనదే అని ప్రతీసారి అనుకుంటున్నాను. కానీ 2021 మాత్రం ఈసారి మనదే అయ్యింది. మహర్షి తర్వాత కంగారు పడి సినిమా చేయకూడదు కంటెంట్ తో చేద్దామని నిర్ణయం తీసుకున్నాను.

 

విజయ్ వచ్చి కథ చెప్పినప్పుడు పోలీస్, లాయర్ ల గురించి అన్ని విషయాలు రీసెర్చ్ చేసి చేయాలని అతనికి చెప్పాను. మేము సినిమాలో చెప్పిన సెక్షన్స్ గురించి ఇటీవల ఓ పోలీస్ అధికారి సినిమా చూసి మెచ్చుకున్నారు. చాలా రీసెర్చ్ చేశారు కదా అని ఆయన అడిగారు. విజయ్ కు, రైటర్ లకు థ్యాంక్స్ చెబుతున్నాను. విజయ్ గారికి చాలా చెక్స్ వచ్చి ఉంటాయి అడ్వాన్స్ లుగా. విజయ్ తో ఒకాయన మాట్లాడుతూ..ఫ్లాప్ హీరోతో సినిమా చేస్తున్నావేంటని అడిగాడట. అప్పుడు విజయ్ కథలో కంటెంట్ ఉండాలి, హీరో టాలెంటెడ్ అయి ఉండాలి సక్సెస్ ఫెయిల్యూర్ తో పనిలేదు అన్నాడట. సతీష్ నిర్మాతగా ధైర్యం చేశార``ని ఉద్వేగంగా చెప్పుకొచ్చాడు న‌రేష్‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS