నరేష్‌కి సెకండ్ ఇన్నింగ్స్ లో ఊపిరి పోసిన సినిమా `నాంది`. ఇప్పటి వరకూ అల్లరి నరేష్.. అని పిలిచిన వాళ్లు, ఇప్పుడు నాంది నరేష్ అంటున్నారు. నాంది విమర్శకుల ప్రసంశల్ని సైతం అందుకుంది. ఈయేడాది వచ్చిన ఉత్తమ చిత్రాల్లో నాందికి స్థానం కట్టబెట్టారు. ఇప్పుడు ఓటీటీలోనూ నాంది దుమ్ము రేపుతోంది. ఆహాలో.. నాంది ఇటీవలే వచ్చింది. అతి తక్కువ సమయంలో 100 మిలియన్ నిమిషాల వ్యూస్ సంపాదించుకున్న సినిమాగా నాంది నిలిచింది.
ఇటీవలే క్రాక్ కూడా ఆహాలోనే వచ్చింది. క్రాక్ కూడా వంద మిలియన్ నిమిషాల వ్యూస్‌ని తక్కువ సమయంలోనే సాధించింది. క్రాక్ తో పోలిస్తే.. నాంది త్వరగా ఆ మైలు రాయిని చేరుకోవడం విశేషం. ఇటీవల వరుస ఫ్లాపుల నేపథ్యంలో నరేష్ సినిమాకి శాటిలైట్ రైట్స్ కూడా రావడం లేదు. నాంది దయతో.. ఇప్పుడు నరేష్‌కి శాటిలైట్, ఓటీటీ ద్వారాలు తెరచుకున్నట్టైంది.