ముట్టుకుంటే కందిపోయే అందం తమన్నాది. అందుకే ఆందరూ ఆమెను మిల్కీ బ్యూటీ అని ముద్దుగా పిలుచుకుంటుంటారు. మిల్కీబ్యూటీని ఇంతవరకూ గ్లామర్ తారగా చూశాం. 'బాహుబలి'తో ఆమెలోని యాక్షన్ గాళ్‌ని వెలికి తీశాడు జక్కన్న రాజమౌళి. ఇక త్వరలో 'సైరా'లో లక్ష్మీ పాత్రతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలోనూ మిల్కీబ్యూటీ యాక్షన్ ఇరగదీసేస్తున్న స్టిల్స్ ఆల్రెడీ చూశాం.
నెక్ట్స్ తమిళంలో విశాల్ హీరోగా తెరకెక్కుతోన్న 'యాక్షన్' సినిమాలో తమన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఓరియెంటెడ్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో విశాల్‌కి జోడీగా నటిస్తున్న తమన్నా, విశాల్‌తో సమానంగా యాక్షన్‌కీ సై అనేందుకు సిద్ధంగా ఉంది. విశాల్‌తో పాటు, కొన్ని రిస్కీ షాట్స్‌లో తమన్నా కూడా నటించనుందట. తమన్నాలోని యాక్షన్ గాళ్‌ని చూసి డైరెక్టర్ సుందర్.సి ఆశ్చర్యపోతున్నారట. అంతలా యాక్షన్‌లో సత్తా చాటుతోందట మిల్కీ బ్యూటీ తమన్నా.
త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే, ఒకప్పుడు కమర్షియల్ మూవీస్‌కే సై అనే తమన్నా, ఇప్పుడు యాక్షన్ అండ్ డిఫరెంట్ మూవీస్‌కి కాలు దువ్వుతోంది. ముఖ్యంగా ప్రాధాన్యత ఉన్న పాత్రల్ని ఎంచుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తోంది. తమన్నాలో వచ్చిన ఈ మార్పుతో ఆమె నుండి మరిన్ని ఈ తరహా మూవీలు రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.