గ్లామ్‌షాట్‌: ఆరెంజ్‌ హాట్‌లో మెల్లగా దోచేశావే.!

By iQlikMovies - February 06, 2019 - 16:45 PM IST

మరిన్ని వార్తలు

'నన్ను దోచుకుందువటే' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది బ్యూటీ నభా నటేష్‌. 'సిరి సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌' అంటూ ఆ సినిమాలో క్యూట్‌ క్యూట్‌గా తన అల్లరితో హీరోనే కాదు, ఆడియన్స్‌ అందర్నీ ఇంప్రెస్‌ చేసింది. ఇప్పుడా ఇంప్రెషన్‌తోనే వరుస అవకాశాల్ని కూడా దక్కించుకుంటోంది. 

 

తాజాగా యంగ్‌ అండ్‌ ఎనర్జిటిక్‌ హీరో రామ్‌తో 'ఇస్మార్ట్‌ శంకర్‌' సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాతో పాటు, మరో రెండు మూడు ప్రాజెక్టులు నభా చేతిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే సిట్యువేషన్‌ డిమాండ్‌ చేస్తే గ్లామర్‌ పండించడానికైనా సిద్ధమే అంటోంది. ఎలాంటి గ్లామరయ్యా అది.. అంటే సిట్యువేషన్‌ని బట్టి కొంతవరకూ లిమిట్స్‌లోనే గ్లామర్‌ని పండిస్తానని చెబుతోంది నభా నటేష్‌. 

 

తొలి సినిమాలో ట్రెడిషనల్‌గా చూశాం కదా. అందుకే శాంపిల్‌గా తనలోని గ్లామర్‌ని ఇదిగో ఇలా ఎక్స్‌పోజ్‌ చేసి చూపిస్తోంది. ఏది ఏమైనా నభాని క్యూట్‌ అండ్‌ స్వీట్‌గా చూస్తేనే బావుంటుందనిపిస్తోంది. అయితే తినగా తినగా వేపాకు కూడా తియ్యగా ఉంటుందన్నట్లు, చూడగా చూడగా నభా నటేష్‌ గ్లామర్‌ యాంగిల్‌ కూడా అలవాటైనా అయిపోతుంది. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS